గుడికెళ్లి అడ్డంగా బుక్కైనా మెగా హీరో.. ఇది అస్సలు ఊహించలేదు 'బ్రో'
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు సాయి ధరమ్ తేజ్. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా పలు విభాగాల్లో అదరగొట్టి సుప్రీమ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అనేక చిత్రాల్లో నటించి సాయి ధరమ్ తేజ్ కు హిట్ అందించిన చిత్రాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. కానీ, ఇటీవల విరూపాక్ష సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సాయి ధరమ్ తేజ్ త్వరలో బ్రో మూవీతో అలరించేందుకు రెడీ అయ్యాడు. అయితే తాజాగా అతను ఊహించనివిధంగా వివాదంలో ఇరుక్కున్నాడు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
మామ అల్లుళ్లు పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్ తొలిసారిగా కలిసి నటిస్తున్న చిత్రం బ్రో (Bro Movie). వినోదయ సీతమ్ రీమేక్ గా తెరకెక్కుతున్న సినిమాకు నటుడు, డైరెక్టర్ సముద్ర ఖని దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్ సమర్పణలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ బ్రో జూలై 28న థియేటర్లలో సందడి చేసేందుకు రెడీగా ఉంది. ఇందుకోసం ఆలయాలను చుట్టేస్తున్నాడు సాయి ధరమ్ తేజ్. తాజాగా కడప జిల్లాలోని అమీర్ పీర్ దర్గాను దర్శించుకున్నాడు. అనంతరం కాణిపాకంలో విఘ్నేశ్వరుడు, శ్రీకాళహస్తిలోని సుబ్రమణ్య స్వామిని దర్శించుకున్న సాయి ధరమ్ తేజ్ ప్రార్థనలు చేసినట్లు తెలుస్తోంది. అయితే దేవుళ్లను సందర్శించే క్రమంలో అనుకోకుండా వివాదంలో చిక్కుకున్నాడు సాయి ధరమ్ తేజ్.
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ శ్రీకాళహస్తిలోని ఆలయాన్ని దర్శించుకోవడమే కాకుండా.. అక్కడున్న సుబ్రమణ్య స్వామికి తానే స్వయంగా హారతి ఇచ్చారు. ఇప్పుడు ఇదే పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. ఆలయ నిబంధనల ప్రకారం స్వామివారికి ఆలయ అర్చకులు మాత్రమే హారతి ఇవ్వాలని, హీరో అయిన సాయి ధరమ్ తేజ్ ఇవ్వడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్చకులు కూడా అలా ఎలా చేయించారని మండిపడుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ టాపిక్ తెగ వైరల్ అవుతోంది. మరి ఈ విషయంపై సాయి ధరమ్ తేజ్ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.


Click it and Unblock the Notifications











