మెగా హీరోకు వరుస ప్లాపులు: ఇక పవన్ కళ్యాణ్ దారిలో...?
మెగా ఫ్యామిలీ నుంచి హీరోలుగా పరిచయమైన దాదాపు అందరూ స్టార్ హీరోల స్థాయికి ఎదిగారు. చిరంజీవి తర్వాత ఆయన వారసత్వంతో వచ్చిన పవన్ కళ్యాణ్ టాలీవుడ్ నెం.1 పొజిషన్ రీచ్ అవ్వగా, ఆ తర్వాత వచ్చిన అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్ ఇలా అందరూ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అయితే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మాత్రం వరుస ప్లాపులు ఎదుర్కొంటుండటం... ఇప్పటి వరకు కెరీర్లో సాలిడ్ హిట్ లేక పోవడంతో... స్టార్ లీగ్‌లో స్థానం సంపాదించుకోలేక పోయాడు. దీంతో ఈ హీరో అదృష్టం కలిసి రావడం కోసం కొత్త దారులు వెతుకున్నట్లు తెలుస్తోంది.

చిరంజీవి, పవన్ కళ్యాణ్ గతంలో ఇలానే...
మెగాస్టార్ అసలు పేరు కొణిదెల శివ శంకర వరప్రసాద్. అయితే సినిమాల్లోకి వచ్చిన తర్వాత చిరంజీవిగా పేరు మార్చుకోగా, కళ్యాణ్ బాబుగా పరిచయమైన పవర్ స్టార్ తర్వాత పవన్ కళ్యాణ్‌గా పేరు మార్చుకున్నారు. పేరు మార్చుకున్న ఈ ఇద్దరూ ఇండస్ట్రీనిలో తిరుగులేని హీరోలుగా ఎదిగారు.

రామ్ చరణ్ కూడా...
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అసలు పేరు రామ్ చరణ్ తేజ్. అయితే లక్ కలిసి రావాలనే తన పేరు నుంచి ‘తేజ్' అనే పదాన్ని తొలగించిన సంగతి తెలిసిందే. వరుస ప్లాపులతో ఉన్న సాయి ధరమ్ తేజ్ కూడా తన పేరును మార్చుకోబోతున్నారట.

ఇకపై సాయి ధరమ్ తేజ్ కాదా?
ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తన నెక్టస్ మూవీ ‘చిత్రలహరి' నుంచి కొత్త పేరుతో ముందుకు రాబోతున్నారట. తన పేరు నుంచి ‘ధరమ్' అనే పదాన్ని లేపేయాలని నిర్ణయించుకున్నారట. మరి కొత్త పేరు ఎలా ఉండబోతోంది అనేది ‘చిత్రలహరి' రిలీజ్ సమయంలో క్లారిటీ రాబోతోంది.

చిత్రలహరి
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ వారు నిర్మిస్తోన్న మూవీ 'చిత్రలహరి'. సాయిధరమ్ తేజ్ సరసన కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఏప్రిల్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











