హ్యాట్సాఫ్ సాయిధరమ్ తేజ్.. మెగా అల్లుడా మజాకా.. తేజ్‌ను చూస్తే ఫిదా..
అభిమానులను కలుసుకోవడానికి ఇష్టపడరు అనే విమర్శ సినీ నటులపై ఉంది. అయితే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అందుకు విభిన్నమని నిరూపించుకొన్నారు.
Recommended Video

సాధారణంగా సినిమా హీరోలు అంటే ప్రేక్షకులకు వల్లమాలిన అభిమానం. కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా తమకు నచ్చిన హీరోలను ఆరాధిస్తారు. కానీ అలాంటి అభిమానులను కలుసుకోవడానికి ఇష్టపడరు అనే విమర్శ సినీ నటులపై ఉంది. అయితే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అందుకు విభిన్నమని నిరూపించుకొన్నారు. ఇటీవల తనను కలుసుకోవడానికి వచ్చిన అభిమానులను చక్కగా పలుకరించడమే కాకుండా వారిని చాలా ప్రేమగా చూసుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

తేజ్‌ను కలిసిన మెగా ఫ్యాన్స్
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తన తాజా చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జరుగుతున్నది. సాయిని కలుసుకునేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. తనను కలవడానికి వచ్చిన ఫ్యాన్స్‌ను సాదారంగా ఆహ్వానించారు. సుదూరం నుంచి వచ్చిన వాళ్ల కష్టసుఖాలు తెలుసుకొన్నారు. షూటింగ్ స్పాట్‌లో అభిమానులందరికీ భోజనాలు పెట్టించారు.

అభిమానులకు విందు
తమ అభిమాన హీరో సాయిధరమ్ తేజ్‌ను చూసిన ఆనందంతోపాటు ఆయన ఇచ్చిన విందు అభిమానులు ఆరగించారు. సాయిధరమ్ తేజ్ చూపించిన ప్రేమను అభిమానులు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. సాయితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కృతజ్ఞతలు తెలిపారు.

మెగా బ్రదర్స్ బాటలో సాయిధరమ్ తేజ్
ఇదిలా పక్కన పెడితే.. పోలికల్లోనే కాదు.. ఆచరణలోనూ మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్ బాటలో నడుస్తున్నాడు సాయి ధరమ్ తేజ్. తనను కలుసుకోవడానికి వచ్చిన అభిమానుల్లో దివ్యాంగుడైన ఒకరిని అప్యాయంగా పలుకరించాడు. అభిమానితో ఫొటో దిగేందుకు సాయిధరమ్ తేజ్ నేలపై మోకాళ్లపై నించొని ఫొటోకు ఫొజిచ్చారు. దీనిని బట్టి చూస్తే సాయిధరమ్‌కు ఎక్కడ నెగ్గాలో.. ఎక్కడ తగ్గాలో తెలుసు అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

డిసెంబర్ 1న జవాన్ రిలీజ్
సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం 'జవాన్' డిసెంబర్ 1న విడుదల కానున్నది. సాయి సరసన మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్‌గా నటిస్తున్నది. ఈ సినిమా ఆడియో ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. 'ఇంటికొక్కడు' అనే టాగ్‌లైన్‌తో బివీఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కిన జవాన్ సినిమాపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.


Click it and Unblock the Notifications











