Sai Dharam Tej ఆరోగ్య పరిస్థితి ఇదే.. హాస్పిటల్ కీలక ప్రకటన.. హాస్పిటల్ కి పవన్, చిరు!

టాలీవుడ్ హీరో మెగా ఫ్యామిలీకి చెందిన సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ బైక్ మీద వెళుతున్న ఆయన ఆ బైక్ స్కిడ్ కావడంతో కిందపడి తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే ఆయనను హుటాహుటిన దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తరలించగా ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని అపస్మారక స్థితిలో ఉన్నారంటూ వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం హాస్పిటల్ యాజమాన్యం అధికారికంగా ప్రకటన చేసింది. హాస్పిటల్ ఏమన్నది ? ఆ రిపోర్ట్ లో ఏమున్నది అనే వివరాల్లోకి వెళితే

కోహినూర్ హోటల్ వద్ద

కోహినూర్ హోటల్ వద్ద

మెగాహీరో సాయిధరమ్ తేజ్ కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సెప్టెంబర్ 10వ తేదీ శుక్రవారం సాయంత్రం 9 గంటల దాటిన తర్వాత ఆయన జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 కేబుల్ బ్రిడ్జి రోడ్ నుంచి గచ్చిబౌలి వెడుతుండగా కేబుల్ బ్రిడ్జి దాటిన తర్వాత కోహినూర్ హోటల్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన లెఫ్ట్ టర్నింగ్ తీసుకుంటూ ఉండగా రోడ్డు మీద ఇసుక ఉండటంతో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో బైక్ 120 కిలోమీటర్ల వేగంతో ఉందని అంటున్నారు

అప్పుడు స్పృహలో లేరు

అప్పుడు స్పృహలో లేరు

అంత వేగంలో బైక్ ఉన్న కారణంగా బైక్ స్కిడ్ కావడంతో ఆయన పడిపోయారని అక్కడే ఉన్న స్థానికులు హుటాహుటిన అంబులెన్స్ కి ఫోన్ చేసి పిలిపించి ఆయనను దగ్గరలో ఉన్న మాదాపూర్ మెడికవర్ హాస్పిటల్ కి తరలించారు అని అంటున్నారు. ప్రమాదం జరిగిన కొన్ని క్షణాల్లోనే ఆయనను హాస్పిటల్ కి తరలించగా, హాస్పిటల్ కి తరలించే సమయానికి ఆయనకు స్పృహ లేదని హాస్పిటల్ కి తరలించాక ఆయనకు స్పృహ వచ్చిందని అంటున్నారు.

అపోలో హాస్పిటల్ కి

అపోలో హాస్పిటల్ కి

ఇక హాస్పిటల్ యాజమాన్యం నుంచి వచ్చిన సమాచారం మేరకు సాయి ధరంతేజ్ ఆరోగ్యం ప్రస్తుతానికి బాగానే ఉందని ఆయనకు తగిలినవి చిన్న గాయాలే అయినా ముందు జాగ్రత్త చర్యతోనే హాస్పిటల్ లో ఉంచామని మాదాపూర్ మెడికల్ హాస్పిటల్ యాజమాన్యం ప్రకటించింది. ఇక సాయి ధరంతేజ్ సోదరుడు రామ్ చరణ్ భార్య ఉపాసనకు సంబంధించిన అపోలో హాస్పిటల్ కి తరలించేందుకు కూడా ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని అంటున్నారు.

పవన్ కళ్యాణ్, చిరంజీవిలు హాస్పిటల్ కి

పవన్ కళ్యాణ్, చిరంజీవిలు హాస్పిటల్ కి

ఇక ప్రమాదం జరిగిన వెంటనే విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్, చిరంజీవిలు హాస్పిటల్ కి చేరుకున్నారు, అప్పటికే సాయి ధరంతేజ్ సోదరుడు హీరో వైష్ణవ్ తేజ్ కూడా తన తల్లిని తీసుకొని హాస్పిటల్ కి చేరుకున్నారు. వరుణ్ తేజ్, ఆయన సోదరి నిహారిక కూడా హాస్పిటల్ కి వచ్చారని, అల్లు అరవింద్ అలాగే సాయి ధరమ్ తేజ్ తో సన్నిహిత సంబంధాలు ఉన్న హీరో సందీప్ కిషన్ కూడా విషయం తెలిసిన వెంటనే హాస్పిటల్ కి వచ్చారని అంటున్నారు.

ప్రమాదం అయితే ప్రస్తుతానికి ఏమీ లేదు

ప్రమాదం అయితే ప్రస్తుతానికి ఏమీ లేదు

అయితే సాయి ధరంతేజ్ కు ప్రమాదం అయితే ప్రస్తుతానికి ఏమీ లేదని చెబుతున్నారు. అవసరమైతే అపోలో హాస్పిటల్ కు తరలిస్తారని అయితే ఆ అవసరం కూడా పడకపోవచ్చు వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. బయటకు గాయాలు ఏమీ కనబడడం లేదు కాబట్టి అంతర్గతంగా లోపల ఏదైనా గాయాలు అయ్యాయి అనే విషయం మీద అనుమానాలు వ్యక్తం కావడంతో ఆయనకు సిటీ స్కాన్ చేస్తున్నారని ఈ సిటీ స్కాన్ లో ఏమైనా ఇబ్బందులు అనిపిస్తే అప్పటికప్పుడు అపోలో హాస్పిటల్ కి తరలించి అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Recommended Video

Bheemla Nayak Singer Mogulaiah Launches Sundarangudu Poster
బైక్ ఓవర్ స్పీడ్ కావడంతోనే

బైక్ ఓవర్ స్పీడ్ కావడంతోనే

పోలీసుల ప్రాథమిక విచారణ నేపథ్యంలో బైక్ ఓవర్ స్పీడ్ కావడంతోనే పడిపోయారని అక్కడ ఉన్న సీసీ ఫుటేజీని ప్రస్తుతం పోలీసులు పరిశీలిస్తున్నారని అంటున్నారు. నిజానికి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కి బైకులు అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని ఆయన చాలాసార్లు తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు కూడా. ఆయన తన స్నేహితులతో కలిసి బైకుల మీద లాంగ్ డ్రైవ్స్ కూడా వెళుతూ ఉంటారు. కానీ ఎప్పుడూ ప్రమాదం జరిగిన దాఖలాలు లేవు. కానీ ఈరోజు ఇసుక ఉండడంతో ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఇక ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ హీరోగా రిపబ్లిక్ అనే సినిమా రూపొందుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X