షూటింగ్‌లో గాయపడ్డ చిరు మేనల్లుడు
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ 'రేయ్" సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం....సాయిధరమ్ తేజ షూటింగ్ స్పాట్ లో గాయపడ్డట్లు తెలుస్తూంది. వైద్యులు అతనికి నెల రోజుల పాటు విశ్రాంతి అవసరం అని చెప్పడంతో...యూనిట్ సభ్యులంతా ఇండియాకు తిరుగు ప్రయాణం అయ్యారు.
ప్రముఖ దర్శకుడు వై.వి.ఎస్ చౌదరి స్వీయ నిర్మాణ సారథ్యంలో తన బొమ్మరిల్లు బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ద్వారా సాయిధరమ్ తేజతో పాటు, సుబ్ర అనే హీరోయిన్ టాలీవుడ్ కు పరిచయం అవుతుంది. మ్యూజికల్ అండ్ లవ్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమాలో ఎక్కువ భాగం యుఎస్ఏ, వెస్టిండీస్ లలో ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో షూటింగ్ జరుగుతుండగా సాయి ధరమ్ తేజ గాయపడ్డాడు.


Click it and Unblock the Notifications











