»   » మెగా "జవాన్" వచ్చేసాడు, అమేజింగ్ ప్రీ లుక్ పోస్టర్

మెగా "జవాన్" వచ్చేసాడు, అమేజింగ్ ప్రీ లుక్ పోస్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా జవాన్‌ అనే సినిమా తెరకెక్కుతుంది. దర్శకుడు బి.వి.ఎస్‌.రవి. ఈ సినిమాకి జవాన్ అని పేరు పెట్టడం తో ఇదేదో ఆర్మీ సోల్జర్ కధ అనుకున్నారు. అయితే అసలు కధ వేరు. ఇంటికి జవాన్. దేశానికి జవాన్‌ ఎంత అవసరమో.. మన ఇంటికి సమస్యలొస్తే వాటిని ఎదుర్కోవడానికి కూడా అలాంటి ఒకరు అవసరమని చెప్పే కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారట.

సైనికుడి పాత్రలో కనిపిస్తాడంటూ

సైనికుడి పాత్రలో కనిపిస్తాడంటూ

ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సైనికుడి పాత్రలో కనిపిస్తాడంటూ హల్ చల్ చేస్తున్న వార్తలను ఆ యువహీరో ఖండించాడు. ఈ చిత్రంలో ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడిగా, దేశ భక్తుడి పాత్రను పోషిస్తున్నానని చెప్పాడు. దేశం-కుటుంబం..ఈ రెండింటిలో దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలనే పరిస్థితి తలెత్తే ఓ సన్నివేశం ఈ చిత్రంలో ఉంటుందని, దేశానికే మొదటి ప్రాముఖ్యతను ఇస్తాడని సాయి ధరమ్ చెప్పాడు.


తాజాగా టాకీ పార్టును పూర్తి చేసుకుంది

తాజాగా టాకీ పార్టును పూర్తి చేసుకుంది

ఈ సినిమా, తాజాగా టాకీ పార్టును పూర్తి చేసుకుంది. ముందుగా చెప్పినట్టుగానే ఈ సినిమా నుంచి కొంత సేపటి క్రితం ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. ఫస్టులుక్ కోసం ఆత్రుతగా ఎదురుచూసేలా .. సినిమాపై ఆసక్తిని రేకెత్తించేలా ఈ ప్రీ లుక్ వుంది. తమన్ సంగీతం .. మెహ్రీన్ గ్లామర్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు.


ఇంటికొక్కడు

ఇంటికొక్కడు

మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఓ యువకుడికి ఎలాంటి కష్టాలు వచ్చాయి? కుటుంబాన్ని కాపాడుకొనేందుకు ఎలా పోరాటం చేశాడన్నదే ‘జవాన్‌' కథ. దీనికి ఒక ట్యాగ్ లైన్ కూడా వుంది. అదే ఇంటికొక్కడు. ఇందులో మెహరీన్‌ హీరోయిన్. దిల్ రాజు నిర్మాత. ఆగస్టులో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.


రెండు ఫ్లాపుల తరువాత

రెండు ఫ్లాపుల తరువాత

రెండు ఫ్లాపుల తరువాత చేస్తోన్న కారణంగా ఈ సినిమాతో హిట్ పడటం సాయిధరమ్ తేజ్ కి చాలా అవసరం. ఇక దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే శభాష్ అనిపించుకోవడం రవికి కూడా చాలా అవసరం. ఈ ఇద్దరి ఆశలను ఈ సినిమా ఎంతవరకూ నెరవేరుస్తుందో చూడాలి.English summary
Mega Hero saidhram tej"s next Movie "Jawan- intikokkadu" pre Look poster released today.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu