మెహ్రీన్ అసలువిషయం లీక్ చేసేసిందిగా: జవాన్ ఇంకా షూటింగ్ లోనే ఉందా!?

అంతా అనుకున్న ప్రకారం జరిగితే సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా ‘జవాన్’ ఈపాటికే రిలీజైపోవాల్సింది. ఈ చిత్ర సమర్పకుడు దిల్ రాజు సంతృప్తిగా లేడని.. రీషూట్లు చేయిస్తున్నాడని ఊహాగానాలు నిజమే అని తెలుస్తోంది.

Recommended Video

Sai Dharam Tej "Jawaan" Movie Still In Shootingమెహ్రీన్ అసలువిషయం లీక్ చేసేసిందిగా |

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ ఫిర్జాదా జంటగా నటిస్తున్న బివిఎస్ రవి దర్శకత్వం వ‌హిస్తున్నచిత్రం జవాన్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విడుద‌ల చేసిన ప్రీలుక్ పోస్టర్, టైటిల్‌కి, మొద‌టి లుక్ పోస్టర్‌కి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. జ‌వాన్ అంటే అస‌లు ఎలాంటి క‌థ అనే చర్చ అభిమానులు, ప్రేక్షకుల్లో ఆశ‌క్తి మారింది. హీరో సెల్‌‌ఫోన్ ప‌ట్టుకుని ఎమెష‌న‌ల్‌గా ఉండ‌టం, మొబైల్‌లో ఓ ఫ్యామిలి ఫోటో ఉండ‌టం చూస్తే ఇది పక్కా ఫ్యామిలీ ఎంట‌ర్‌‌టైన‌ర్ అనిపించేలా అనిపిస్తోంది అంటూ చాలానే చర్చ జరిగింది....

ఈపాటికే రిలీజైపోవాల్సింది

ఈపాటికే రిలీజైపోవాల్సింది

అంతా అనుకున్న ప్రకారం జరిగితే సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా ‘జవాన్' ఈపాటికే రిలీజైపోవాల్సింది. ఆ చిత్రాన్ని సెప్టెంబరు 1నే రిలీజ్ చేసేందుకు డేట్ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. అసలు మొదట్లో ఉన్న ప్రణాళికల ప్రకారమైతే ఆగస్టు 11కే ఈ చిత్రాన్ని విడుదల చేయాల్సింది.

సెప్టెంబరు 1కి అనుకుంటే

సెప్టెంబరు 1కి అనుకుంటే

కానీ కుదర్లేదు. సెప్టెంబరు 1కి అనుకుంటే ‘పైసా వసూల్' వచ్చి పడింది. సినిమా వాయిదా పడటానికి కారణం అదే అయితే తర్వాతి వారమో.. ఆపై వారమో రిలీజ్ చేసేయాల్సింది. కానీ అలాంటి ప్రయత్నాలేమీ చేయలేదు. అక్టోబర్లోనో.. నవంబర్లోనో రిలీజ్ చేసుకుందామన్న ఆలోచనకు వచ్చేసినట్లు తెలుస్తోంది ఈ చిత్ర బృందం.

దిల్ రాజు సంతృప్తిగా లేడని

దిల్ రాజు సంతృప్తిగా లేడని

ఇందుకు కారణాలు లేకపోలేదని.. ఔట్ పుట్ విషయంలో ఈ చిత్ర సమర్పకుడు దిల్ రాజు సంతృప్తిగా లేడని.. రీషూట్లు చేయిస్తున్నాడని ఊహాగానాలు వినిపించాయి. ఈ విషయం నిజమేనని ‘జవాన్' హీరోయిన్ మెహ్రీన్ కౌర్ మాటల్ని బట్టి తెలుస్తోంది. ఈ అమ్మాయి ట్విట్టర్లో సోమవారం రాత్రి ఒక మెసేజ్ పెట్టింది. ఈ రోజు తెల్లవారుజామున నుంచి రాత్రి వరకు తాను ఎలా కష్టపడిపోయింది వివరించింది.

రీషూట్ రూమర్లు వాస్తవమే

రీషూట్ రూమర్లు వాస్తవమే

ఉదయం ‘జవాన్' షూటింగ్‌లో పాల్గొన్నట్లుగా ఆమె వెల్లడించింది. సెప్టెంబరు 1కే రిలీజ్ అనుకున్న సినిమాకు ఇప్పుడు షూటింగ్ చేయడాన్ని బట్టి.. రీషూట్ రూమర్లు వాస్తవమే అని తేలిపోయింది. ఐతే ఔట్ పుట్ చూసుకుని రీషూట్లు చేయడంలో తప్పేముందన్న అభిప్రాయాన్ని ‘సోగ్గాడే చిన్నినాయనా', ‘రారండోయ్ వేడుక చూద్దాం' లాంటి సినిమాలతో నాగార్జున రుజువు చేసిన నేపథ్యంలో ఈ విషయాన్ని ‘జవాన్' టీం దాచి పెట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదేమో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X