డేట్‌కి రమ్మంటే బాయ్ ఫ్రెండ్‌కి చెప్తా అంది: తన డేటింగ్ అనుభవం చెప్పిన మెగా హీరో
ఇప్పుడున్న కుర్ర హీరోలు కొన్ని విషయాలకు చాలా దూరంగా ఉంటారు. తమపై లేని పోని పుకార్లు రాకుండా ఉండేందుకు ఏం చేయాలో అన్నీ చేస్తుంటారు. కానీ యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ మాత్రం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదనితిక్క హీరోయిన్ లారిస్సా బొనేసి తో డేటింగ్ చేసేస్తున్నాడనీ, ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారనీ వార్తలు రావటం అప్పట్లో చాలామందినే ఆకర్షించింది. నిజానికి అది రూమర్ మాత్రమే అని తొందరలోనే తేలిపోయిందనుకోండి... అయితే ఆ గాసిప్ రావటానికి గల కారణాన్ని మరో సారి ఇలా చెప్పాడు సాయిధరమ్ తేజ్.

సాయిధరమ్ తేజ్
టాలీవుడ్‌లో చిరంజీవి మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చి, హీరోగా దూసుకుపోతున్న నటుడు సాయిధరమ్ తేజ్. సాయిధరమ్ తేజ్ నటించిన "జవాన్" చిత్రం డిసెంబర్ 30న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా
ఎప్పుడూ మెగా హీరోల గురించి ఏదో విషయం చెప్పే సాయిధరమ్.. ఈసారి మాత్రం తన గురించి ఓ విషయాన్ని షేర్ చేసుకున్నారు. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా బుల్లితెరపై ప్రదీప్ యాంకర్‌గా ప్రసారం అవుతున్న "కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా" కార్యక్రమానికి వచ్చాడు సాయిధరమ్ తేజ్.

డేటింగ్ ప్రశ్న
కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపి ఫుల్ ఎంటర్‌టైన్ చేశారు. ముఖ్యంగా ప్రదీప్ అడిగిన హీరోయిన్‌తో డేటింగ్ ప్రశ్నకు.. సాయి చెప్పిన సమాధానం విన్న వారంతా పగలబడి నవ్వారు. సాయి ఈ ప్రశ్నకి సమాధానం చెబుతూ.. అందరినీ నవ్వించేసాడు

అలా ప్రపోజ్ చేశాను
ఏ హీరోయిన్ నన్ను డేట్‌కి పిలవలేదు కానీ.. నేనే ఓ హీరోయిన్‌కి అలా ప్రపోజ్ చేశాను. కానీ ఆమె ఏం చెప్పిందో తెలుసా? ఆ విషయం నా బాయ్ ఫ్రెండ్‌ని అడిగి చెబుతాను అంది..'' అని సాయి తెలపడంతో ప్రదీప్‌తో పాటు అక్కడున్న వారంతా నవ్వు ఆపుకోలేనంత నవ్వేశారు.

అర్థమైపోయింది
ఈ మాట వినగానే అక్కడున్న అందరికీ ఆమె లారిస్సా నే అన్న సంగతి అర్థమైపోయింది. అప్పట్లో వీరిద్దరిపై రూమర్లు వచ్చిన విషయం తెలిసిందే. ఆ రూమర్లను ఇరువురు ఖండించిన విషయం కూడా తెలిసిందే. మొత్తానికి చిన్న చిన్న విషయాలు కూడా ఎంత పెద్ద రూమర్లకు కారణం అవుతాయో ఈజీగానే తెలిసిపోయిందన్న మాట ఈ కుర్ర హీరోకి.


Click it and Unblock the Notifications











