ఈ మాయ పేరేమిటో హీరో హీరోయిన్ పోస్టర్ లాంచ్ చేసిన సాయి ధరమ్ తేజ్
సీనియర్ ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ఈ మాయ పేరేమిటో. కావ్యా థాపర్ హీరోయిన్. వి.ఎస్.వ వర్క్స్ బేనర్‌పై రాము కొప్పుల దర్శకత్వంలో దివ్యా విజయ్ ఈ లవ్, కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు. ఇటీవల వరుణ్ తేజ్ పోస్టర్ లోగో విడుదల చేయగా, తాజాగా.....ఈ మూవీ హీరో హీరోయిన్ పోస్టర్ ను తాజాగా సాయి ధరమ్ తేజ్ విడుదల చేశారు.
దర్శకుడు రాము కొప్పుల మాట్లాడుతూ - మంచి లవ్, కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఈ మూవీ తెరకెక్కుతోంది. చిత్రీకరణంతా పూర్తయ్యింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరిగుతున్నాయి. రాహుల్ విజయ్ సూపర్బ్ పెర్ఫామర్. దివ్య విజయ్ మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. మణిశర్మ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్, శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిట్ వర్క్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్. అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా సినిమా ఉంటుంది అన్నారు.

నిర్మాత దివ్యా విజయ్ మాట్లాడుతూ - సినిమాను అనుకున్న ప్లానింగ్‌లో పూర్తి చేశాం. అన్నీ అంశాలతో దర్శకుడు రాముగారు సినిమాను చక్కగా తెరకెక్కించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి వీలైనంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అన్నారు.
రాహుల్ విజయ్, కావ్యా థాపర్ జంటగా నటించిన ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, మురళీశర్మ, రాళ్లపల్లి, ఈశ్వరీరావు, పవిత్రా లోకేశ్, సత్యం రాజేశ్, జోశ్ రవి, కాదంబరి కిరణ్ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఫైట్స్: విజయ్, ఎడిటర్: నవీన్ నూలి, ఆర్ట్: చిన్నా, సాహిత్యం: శ్రీమణి, సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: శామ్ కె.నాయుడు, నిర్మాత: దివ్యా విజయ్, దర్శకత్వం: రాము కొప్పుల.


Click it and Unblock the Notifications











