తెరపైకి మరో మల్టీస్టారర్: మెగా హీరోతో మాస్ మహారాజా.. వర్కౌట్ అవుతుందా.?

By Manoj

తెలుగు సినిమా తొలినాళ్లలో మల్టీస్టారర్ మూవీలు చాలా వచ్చేవి. అప్పుడు హీరోలు పాత్రకు ఉన్న ప్రాధాన్యతను అంతగా పట్టించుకునే వారు కాదని, అందుకే ఈ సినిమాలు వచ్చేవని అంటుంటారు. అయితే, రెండో తరం హీరోల సమయంలో ఈ సినిమాలు అంతగా కనిపించలేదు. దీనికి ప్రేక్షకుల మైండ్‌సెట్ మారడమే ప్రధాన కారణంగా చెప్పుకుంటారు. అయితే, రోజులు మారుతున్న కొద్దీ తెలుగు ప్రేక్షకులు కొత్తదనం వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మల్టీస్టారర్ మూవీలను కూడా స్వాగతిస్తున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. తాజాగా టాలీవుడ్‌లో మరో మల్టీస్టారర్ మూవీ గురించి ఓ వార్త తెరపైకి వచ్చింది. ఇంతకీ ఏంటా వార్త.? వివరాల్లోకి వెళితే..

మల్టీస్టారర్ అంటే గుర్తొచ్చేది ఆయనే

మల్టీస్టారర్ అంటే గుర్తొచ్చేది ఆయనే

ప్రస్తుత పరిస్థితుల్లో మల్టీస్టారర్ మూవీ అంటే గుర్తొచ్చేది విక్టరీ వెంకటేష్ పేరే. టాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో ఆయన చేసినన్ని సినిమాలు మరెవరూ చేసుండరు. మహేష్‌తో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', పవన్‌ కల్యాణ్‌తో ‘గోపాల గోపాల', రామ్‌తో ‘మసాలా', వరుణ్‌ తేజ్‌తో ‘F2' సినిమాలను చేశాడు వెంకీ. అలాగే, మరికొన్ని చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

 అలాంటి సినిమా చేయాలని ప్లాన్లు

అలాంటి సినిమా చేయాలని ప్లాన్లు

తెలుగులో మల్టీస్టారర్ మూవీ అని కాదు కానీ.. ఫ్యామిలీ అంతా కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుందో ‘మనం' సినిమా ద్వారా అక్కినేని కుటుంబం చూపించింది. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో, ఇండస్ట్రీలోని అన్ని ఫ్యామిలీలు ఆ తరహా సినిమా చేయాడానికి ప్లాన్ చేస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో ఇవి పట్టాలెక్కే అవకాశాలూ లేకపోలేదు.

జక్కన్న కలిపాడు ఇద్దరినీ

జక్కన్న కలిపాడు ఇద్దరినీ

ఇక, తెలుగులోనే భారీ మల్టీస్టారర్ తెరకెక్కుతోంది. అదే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘RRR'. ఇందులో నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్, మెగా హీరో రామ్ చరణ్ తేజ్ నటిస్తున్నారు. వీళ్ల కలయిక రెండు కుటుంబాల ఫ్యాన్స్‌ను కూడా కలిపేసిందనే చెప్పాలి. ఈ సినిమా ప్రకటన తర్వాత మరికొంత మంది హీరోలు మల్టీస్టారర్ వైపు మొగ్గు చూపుతున్నారు.

 మెగా మల్టీస్టారర్ అనుకుంటున్నారు

మెగా మల్టీస్టారర్ అనుకుంటున్నారు

కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ కలిసి సినిమా చేయబోతున్నారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చిరు.. చరణ్ కాంబో కూడా తెరపైకి వచ్చింది. ఇక, ఇటీవల వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ, ఇవేవీ కార్యరూపం దాల్చలేదు.

మెగా హీరోతో రవితేజ.. వర్కౌట్ అవుతుందా?

మెగా హీరోతో రవితేజ.. వర్కౌట్ అవుతుందా?

సాయి ధరమ్ తేజ్ ‘ప్రతిరోజూ పండగే' చిత్ర ప్రమోషన్‌లో భాగంగా తనకు రవితేజతో కలిసి నటించాలని ఉందని వెల్లడించాడు. ‘నాకు వరుణ్, రవితేజతో మల్టీస్టారర్ చేయాలని ఉంది. రవి గారు అయితే ఎప్పుడు కలిసినా ఇద్దరం కలిసి సినిమా చేయాలబ్బాయ్ అంటుంటారు. మేము కలిస్తే దాని గురించే మాట్లాడుకుంటాం' అని చెప్పుకొచ్చాడు. దీంతో వీళ్లిద్దరి కాంబో చర్చనీయాంశం అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X