పేదోడికి ఫ్లాట్‌ఫాం.. ధర్మాభాయ్ డాట్ కామ్.. సాయిధరమ్ తేజ్ మెరుపులు
Recommended Video

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ నిర్మిస్తున్న చిత్రం 'ఇంటిలిజెంట్'. ఈ చిత్రం టీజర్‌ను నటసింహ నందమూరి బాలకృష్ణ శనివారం విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరో సాయిధరమ్ తేజ్, దర్శకుడు వి.వి.వినాయక్, నిర్మాత సి.కళ్యాణ్, రచయిత శివ ఆకుల పాల్గొన్నారు. సహనిర్మాతల్లో ఒకరైన సి.వి.రావు బొకేలతో స్వాగతం పలికారు.
ఇంటిలిజెంట్ సినిమా టీజర్ లింక్ తెలుగు ఫిల్మీబీట్ పాఠకుల కోసం..

విభిన్నమైన కథతో
దర్శకుడు వీవీ వినాయక్ దర్శకత్వంలో మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించగా ఇంటిలిజెంట్ మూవీ రూపొందింది. బాలకృష్ణ విడుదల చేసిన ఈ టీజర్ చూడగానే ఈ చిత్రం విభిన్నమైన సినిమా కథగా అనిపించింది.
హింస, పిరికితనం
పిరికితనం, హింసలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి వస్తే.. ఎప్పుడూ హింసనే ఎంచుకోవాలి అనే మహాత్మాగాంధీ మాటలను ఈ టీజర్‌లోని తొలి స్లైడ్‌లో పేర్కొనడం గమనార్హం.

అధర్మం.. ధర్మం మధ్య
నేర ప్రవృత్తి అధర్మాన్ని పెంపొందిస్తే.. అప్పుడు హింస ధర్నాన్ని సృష్టిస్తుంది అనే కాన్సెప్ట్‌తో ఇంటిలిజెంట్ సినిమా రూపొందింది. ఈ టీజర్‌లో ముఖ్యంగా యాక్షన్‌కే ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం.

పేదోడికి ఫ్లాట్‌ఫాం.. ధర్మాభాయ్.కామ్
ఇక మీదట పేదోడికి ఫ్లాట్‌ఫాం.. ధర్మభాయ్.కామ్ అని సాయిధరమ్ చెప్పిన డైలాగ్స్ ఫ్యాన్స్‌కు ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ చిత్రం ఫిబ్రవరి 9న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది.


Click it and Unblock the Notifications











