అభిమానికి క్యాన్సర్.. బాధితురాలిని కలిసిన సాయిధరమ్ తేజ్.. ఉద్వేగంతో..
Recommended Video

తెలుగు సినీహీరోలపై అభిమానులు కురిపించే ప్రేమ అంతా ఇంతా కాదు. అలాంటి అభిమానులకు ఎదైనా కష్టమొస్తే హీరోలు కూడా అండగా నిలుస్తారు. తన అభిమానుల కష్టాన్ని తమ కష్టంగా భావిస్తారు. అలాంటి సంఘటనే ఇటీవల సాయిధరమ్ తేజ్‌కు ఎదురైంది. క్యాన్సర్ బారిన పడిన అభిమానిని స్వయంగా పరామర్శించి ఎందరో సినీ నటులకు సాయిధరమ్ తేజ్ ఆదర్శంగా నిలిచారు.

క్యాన్సర్‌తో బాధపడుతున్న అభిమాని
పాండ్రంగి గ్రామానికి చెందిన బంగారమ్మ అనే యువతి బోన్ కేన్సర్ తో బాధపడుతున్నది. డాక్టర్ ట్రీట్‌మెంట్ లో భాగంగా ఓ కాలును తొలగించారు. ఇటీవల 10వ తరగతిలో 8.5 గ్రేడ్‌ను సాధించింది. ఆమె పరిస్థితి తెలుసుకున్న పెందుర్తి గ్రామానికి చెందిన రాము అనే యువకుడు ఆమెకి ఆసరాగా నిలబడ్డాడు. అయితే తన అభిమాన హీరో సాయిధరమ్ తేజ్ సిటికి రావటంతో తెలుసుకున్న బంగారమ్మ తన అభిమాన హీరోని కలవానుకుంది.

ఎయిర్‌పోర్టులో
తేజ్ ఐ లవ్ యు చిత్రానికి సంబంధించిన ప్రమెషన్ లో భాగంగా విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు తిరుగుప్రయాణంలో సుప్రీంహీరో సాయిధరమ్ తేజ్ విమానాశ్రమం వద్దకు చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న సాయిధరమ్ తేజ్ తన అభిమానులచే తనని విమానాశ్రమం దగ్గరకి పిలిపించి కలిశారు.

అభిమాని ఆరోగ్యం గురించి
బంగారమ్మ ఆరోగ్యం గురించి సుప్రీం హీరో అడిగి తెసుసుకున్నాడు. తనకి ఇంతలా సహయ పడుతున్న రాముని కూడా అభినందించాడు. క్యాన్సర్ కారణంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్న ఓ చిట్టితల్లిని సాయిధరమ్ తేజ్ పలకరించడంతో సంతోషంలో మునిగిపోయింది. బంగారమ్మ ఆరోగ్యం బాగా కుదుటపడాలని మెగా అభిమానులందరూ ప్రార్థించాలని సాయిధరమ్ తేజ్ కోరారు.

సాయిధరమ్ తేజ్ ఉద్వేగం
తన అనారోగ్యం తనని కదల్లేని స్థితిలోకి నెట్టినా తన అభిమానం తనని ముందుకు నడిపించిన తీరుపై సాయిధరమ్ తేజ్ ఉద్వేగానికి గురయ్యారు. తనపై ఆ బంగారు తల్లికి ఉన్న అభిమానానికి చూసి మాటలు రాలేదు.. మనసు చమ్మగిల్లింది. చిన్నారి కష్టాన్ని చూసి అభిమాన హీరో దిగ్బ్రాంతి చెందాడు.. కానీ ఆ చిట్టి తల్లి మనోధైర్యాన్ని చూసి ఆనందపడ్డాడు.


Click it and Unblock the Notifications











