హీరో సాయిధరమ్ తేజ్‌కు ప్రమాదం.. పరిస్థితి విషమం.. అపస్మారక స్థితిలోకి..
టాలీవుడ్ యువ హీరో, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురయ్యాడు. స్పోర్ట్స్ బైక్‌పై వేగం వెళ్తూ వాహనం అదుపు తప్పడంతో హైటెక్ సిటీకి సమీపంలోని కేబుల్ బ్రిడ్డి వద్ద పడిపోయాడు. ఆయన తీవ్ర గాయాలు కావడంతో హస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నట్టు సమాచారం.. అయితే ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వార్తలు వెల్లడి కావడంతో మెగా అభిమానులందరూ ఆందోళనలో మునిగిపోయారు. అసలు సాయి ధరంతేజ్ కి ఏమైంది ? యాక్సిడెంట్ ఎలా జరిగింది ? అనే వివరాల్లోకి వెళితే

యాక్సిడెంట్
మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరో సాయి ధరమ్ తేజ్ కి తీవ్ర గాయాలు అయినట్లు వార్తలు వెలువడుతున్నాయి. స్వతహాగా బైక్ లవర్ అయిన సాయి ధరమ్ తేజ్ కి చాలా బైకులు సొంతంగా ఉన్నాయి. అయితే సెలబ్రిటీ కావడంతో హెల్మెట్ పెట్టుకుని అప్పుడప్పుడూ ఆయన సిటీలో చక్కర్లు కొడుతూ ఉంటారు..

బండి కంట్రోల్ కాకపోవడంతోనే
అందులో భాగంగానే ఆయన ఈరోజు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద నుంచి వెళుతున్న సమయంలో బైకు ప్రమాదం జరిగిందని, ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి అని అంటున్నారు. బైక్ యుటర్న్ తీసుకుంటున్న సమయంలో ఇసుక మీద బండి ఎక్కడంతో బండి కంట్రోల్ కాలేదని ఈ నేపథ్యంలోనే స్పోర్ట్స్ బైక్ మీద నుంచి సాయి ధరం తేజ్ కింద పడిపోయాడు అని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు..

హెల్మెట్ ధరించి ఉండడంతో
అయితే ఆయన హెల్మెట్ ధరించి ఉండడంతో తలకు గాయాలు కాలేదు కానీ కుడి కన్ను మీద అలాగే ఛాతీ, పొట్ట భాగంలో తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 కేబుల్ బ్రిడ్జి మార్గంలో ఆయన రోడ్డు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ మార్గంలో ఆయన గచ్చిబౌలి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కేబుల్ బ్రిడ్జి దాటిన తర్వాత కోహినూర్ హోటల్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.

ఐదే నిముషాల్లో
అయితే పండుగ పూట కావడం కేబుల్ బ్రిడ్జి మీద రద్దీగా ఉండడంతో అక్కడి ఉన్న జనాలు వెంటనే గుర్తించి కేవలం ఐదు నిమిషాల వ్యవధిలో అంబులెన్స్లో ఆయనను ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం మేరకు మాదాపూర్లోని మెడికవర్ హాస్పిటల్ కి అయిన తరలించగా అక్కడ ఆయన ఒక సారి స్పృహలోకి వచ్చారు అని అంటున్నారు. తర్వాత స్థితిలోకి వెళ్లిపోయారని వార్తలు వస్తున్నాయి. అయితే ప్రమాదం ఎలా జరిగింది అనే విషయం మీద పోలీసులు అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ ను కూడా పరిశీలించి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
Recommended Video

హుటాహుటిన బయలుదేరిన మెగా ఫ్యామిలీ
ఇక సాయి ధరంతేజ్ కి యాక్సిడెంట్ అయింది అన్న విషయం తెలుసుకున్న మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ మెడికవర్ హాస్పిటల్ కి బయలుదేరినట్లుగా చెబుతున్నారు. అలాగే రామ్ చరణ్ భార్య ఉపాసనకు అపోలో హాస్పిటల్ ఉండటంతో మెరుగైన చికిత్స కోసం అపోలో హాస్పిటల్ కి తరలించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం వెల్లడి కావాల్సి ఉంది, తెలుగు సినీ అభిమానులు అందరూ ఈ వార్తతో దిగ్భ్రాంతికి గురయ్యారు. వీలైనంత త్వరలో సాయిధరమ్ తేజ్ మళ్లీ మామూలు మనిషిగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











