పవన్ సాంగ్ నే టైటిల్ గా సాయి ధరమ్ తేజ్
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ చిత్రం గబ్బర్ సింగ్ లో పాట ప్రారంభాలు వరసగా సినిమా టైటిల్స్ గా వచ్చేస్తున్నాయి. తాజాగా సాయి ధరమ్ తేజ చిత్రానికి కూడా ఆ చిత్రంలోని పాట లోంచి తీసుకుని పెట్టానట్లు తెలుస్తోంది. ఆ టైటిల్ ఏమిటంటే... 'పిల్లా నువ్వు లేని జీవితం..'.
సాయి ధరమ్ తేజ్ హీరోగా ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హృషికేశ్ లో జరుగుతోంది. ఈ మధ్యనే సింగపూర్ లో హీరో,హీరోయిన్స్ మధ్య కీ సీన్స్ ని షూట్ చేసారు. బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి టైటిల్ ఖరారు చేసారు.
గీతా ఆర్ట్స్ మరియు ఎస్ వి.సి సినిమాస్ బ్యానర్ పై బన్నివాసు-దిల్ రాజు మేనల్లుడు హర్షిత్ నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ.. మా బ్యానర్ లో చేస్తున్న 32వ చిత్రం ఇది. మొదటి నుంచి దిల్ రాజుకి నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ సినిమాకు తన భాగస్వామ్యం కూడా ఉంటే బావుంటుందని నిర్మాణ భాధ్యతలు ఆయనకు అప్పగించాను అన్నారు.
దర్శకుడు రవికుమార్ చౌదరి మాట్లాడుతూ.. మొదటి దిల్ రాజు గారికి కథ చెప్పాను. ఆయన నచ్చి అరవింద్ గారి దగ్గరకి తీసుకు వెళ్లారు. ఆయనకు కూడా నచ్చి వెంటనే ఓకే అన్నారు. ఇద్దరు పెద్ద నిర్మాతలతో చేసే అవకాసం రావటం చాలా ఆనందంగా ఉంది అన్నారు.
శ్రీహరి, దువ్వాసి మోహన్, చంద్రమోహన్, సత్యకృష్ణన్, ధర్మవరం, రఘుబాబు తదితరలు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు మరుధూరి రాజా, పాటలు చంద్రబోస్, అశోక్ తేజ, శ్రీమణి, సంగీతం అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫి దాశరధి శివేంద్ర, ఆర్ట్ రమణ వంక, ఎడిటింగ్ గౌతంరాజు, నిర్మాత బన్ని వాసు, హర్షిత్, కథ,స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం ఎఎస్ రవికుమార్ చౌదరి.


Click it and Unblock the Notifications











