twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రంగస్థలం ఫస్ట్‌లుక్‌‌పై సాయి ధరమ్ తేజ్, సుస్మితల ట్వీట్స్

    |

    Recommended Video

    రంగస్థలం ఫస్ట్‌లుక్‌‌పై సాయి ధరమ్ తేజ్ ఏమన్నాడో తెలుసా ? | Filmibeat Telugu

    మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తోన్న 'రంగస్థలం' ఫస్ట్‌లుక్‌ను మైత్రీ మూవీ మేకర్స్ శనివారం రిలీజ్ చేసింది. ఫస్ట్ లుక్‌లో హీరో రామ్ చరణ్ గెటప్ ఆకట్టుకునేలా ఉంది. మాస్ బాడీ లాంగ్వేజ్‌తో పక్కా పల్లెటూరి యువకుడిలా మెగా పవర్ స్టార్ కనిపించారు. ఫస్ట్ లుక్‌తోనే డైరెక్టర్ సుకుమార్ సినిమాపై అంచనాలు పెంచేశారు.

    రంగస్థలం 1985

    రంగస్థలం 1985

    'రంగస్థలం 1985' సినిమా ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకొంటోంది. చెర్రీ జాలీగా స్టెప్ వేస్తున్న స్టిల్‌ని ఫస్ట్‌లుక్‌గా వదిలింది చిత్రబృదం. టైటిల్‌ను పసుపు, ఆరెంజ్ కలర్స్‌తో చాలా చక్కగా డిజైన్ చేశారు. ఫుల్ మాస్ లుక్‌తో చెర్రీ అదరగొడుతున్నారు. ఇక సమంత లుక్ ఎలా ఉండబోతోందో చూడాలి.

     సాయి ధరమ్ తేజ్

    సాయి ధరమ్ తేజ్

    సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమను వచ్చే ఏడాది మార్చి 30న విడుదల చేయనున్నట్లు ఫస్ట్‌లుక్ పోస్టర్‌‌లో ప్రకటించారు. ఈ సందర్భంగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చాలా ఆసక్తికరంగా ట్వీట్ చేశాడు. చెర్రీ ఫస్ట్‌లుక్‌ సాయి ధరమ్‌కి ఫుల్‌గా నచ్చేసింది.

    విజిల్స్

    విజిల్స్

    తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా చూపించేశాడు. ‘‘మా చిట్టిబాబు దుమ్ము లేపాడు.. విజిల్స్..'' అంటూ తేజు ట్వీట్ చేశాడు. ఈ సినిమాలో చెర్రీ పేరు చిట్టిబాబు. సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి, 2018లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

    మెగాస్టార్ చిరంజీవి

    మెగాస్టార్ చిరంజీవి

    ఈ సినిమాకు రామ్ చరణ్ సోదరి సుస్మిత డిజైనర్‌గా వర్క్ చేస్తోంది. సుస్మిత తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి సినిమాలు శంకర్‌దాదా ఎంబీబీఎస్, శంకర్‌దాదా జిందాబాద్ సినిమాలకు పనిచేసింది. ఇప్పుడు సోదరుడు రంగస్థలం సినిమాకు కూడా డిజైనర్‌గా పనిచేస్తోంది.

    సుస్మిత ట్వీట్

    సుస్మిత ట్వీట్

    రంగస్థలం ఫస్ట్‌లుక్ రిలీజ్ అయిన సందర్భంగా సుస్మిత ట్వీట్ చేసింది. ‘‘హ్యాపీ మూమెంట్. అన్నయ్యతో పని చేస్తుంటే చాలా సరదాగా.. హ్యాపీగా ఉంది. మీరంతా ఫస్ట్‌లుక్‌ని ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నా'' అంటూ ట్వీట్ చేశారు.

    English summary
    The first to comment on the poster Rangasthalam 1985 was obviously another mega hero. An excited Sai Dharam Tej posted thus on his twitter handle.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X