చెల్లిని పెళ్లి చేసుకుంటావా అంటే కాలదా.. నిహారిక గురించి రూమర్స్.. సాయిధరమ్ తేజ్!
Recommended Video
ఆరు వరుస పరాజయాల తర్వాత సాయిధరమ్ తేజ్ ఓ విజయం అందుకున్నాడు. తేజు నటించిన చిత్రలహరి చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్రలహరి చిత్రానికి మంచి వసూళ్లు లభించాయి. దర్శకుడు కిషోర్ తిరుమల యువతకు నచ్చే అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. సాయిధరమ్ తేజ్ సరసన ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్, నివేద పెతురాజ్ హీరోయిన్లుగా నటించారు. సాయిధరమ్ తేజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనపై వస్తున్న రూమర్లపై హాట్ కామెంట్స్ చేశాడు.

గ్లాస్ మేట్స్
చిత్రలహరి చిత్రంలో గ్లాస్ మేట్స్ సాంగ్ మాస్ ప్రియులని ఆకట్టుకుంది. రియల్ లైఫ్ లో మీ గ్లాస్ మేట్స్ ఎవరని ప్రశ్నించగా.. తాను పెద్దగా మధ్యం సేవించనని తేజు తెలిపాడు. బర్త్ డే పార్టీ, ఇతర ఫంక్షన్స్ లాంటి సంధర్భాలు వచ్చినప్పుడు మాత్రమే కొంత ఆల్కహాల్ తీసుకుంటానని తెలిపాడు.గ్లాస్ మేట్స్ సాంగ్ కి జనసేన పార్టీ సింబల్ తో ఏమైనా సంబంధం ఉందా అని ప్రశ్నించగా.. అలాంటిది ఏమీ లేదని తేజు తెలిపాడు.

అమ్మతో కలసి
టీ గ్లాస్ మేట్స్ మాత్రం తన జీవితంలో చాలా మందే ఉన్నారని తేజు తెలిపాడు. ప్రతి రోజు అమ్మతో కలసి టీ తాగతా. అలాగే స్నేహితులు కూడా ఉన్నారని సాయిధరమ్ తేజ్ తెలిపాడు. మెగా కుటుంబంలో హీరోల మధ్య పోటీ ఉండదని తేజు తెలిపాడు. మేమంతా అన్నదమ్ముల లాగా పెరిగాం. మామధ్య పోటీ ఎందుకు ఉంటుంది. ఎవరి పని వాళ్ళం చేసుకుంటూ వెళతాం అని తేజు తెలిపాడు. తన తమ్ముడు వైష్ణవ్ తేజ్ కు కూడా ఇది వర్తిస్తుంది అని తేజు తెలిపాడు.

చెల్లిని పెళ్లి చేసుకుంటావా అంటే
నిహారిక పెళ్లి రూమర్స్ వచ్చినప్పుడు మీ కుటుంబం ఎలా ఫీల్ అయిందనే ప్రశ్నకు తేజు స్పందించాడు. మా కుటుంబం కంటే నేను వ్యక్తిగతంగా చాలా బాధపడ్డాను అని తేజు తెలిపాడు. ఈ రూమర్లపై విసుగు, కోపం వచ్చిందని తేజు తెలిపాడు. మేమెంత అన్నా చెల్లెళ్లా పెరిగాం అని తేజు తెలిపాడు. ఎవరైనా వచ్చి మీ చెల్లిని పెళ్లి చేసుకుంటావా అని అడిగితే కాలదా.. నాక్కూడా అలాగే కాలింది అని తేజు తెలిపాడు.

తదుపరి చిత్రం
సాయిధరమ్ తేజ్ తన తదుపరి చిత్రం గురించి మాట్లాడుతూ కొందరు దర్శకుడీలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపాడు. అందులో వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి కూడా ఉన్నాడని తెలిపారు. ప్రాజెక్ట్ ఫైనల్ అయిన తర్వాత ప్రకటిస్తాం అని సాయిధరమ్ తేజ్ తెలిపాడు. తేజు తన తదుపరి చిత్రంలో బరువు తగ్గి కనిపించబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











