రెజినాతో పెళ్లి జరిగింది.. కానీ.. షాకిచ్చిన సాయిధరమ్ తేజ్.. ఆ ఇద్దరితో కూడా అఫైర్లు అని..

By Rajababu

Recommended Video

Sai Dharam Tej Opened Up Affair With Regina..

సాయిధరమ్ తేజ్ కెరీర్ హిట్లు, ఫ్లాపులతో సాగుతున్నది. టాలీవుడ్‌లోకి రావడానికి ముందు తాను పడిన కష్టాలు చాలా ఉన్నాయి అని మెగా మేనల్లుడు చెప్పారు. అన్ని సమయాల్లో తన తల్లి అండగా నిలిచిందని ఆయన పేర్కొన్నాడు. తాను ఈ స్థితిలో ఉండటానికి కారణం తన తల్లి త్యాగాలే అని చెప్పుకొచ్చారు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌తో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ.. మరికొన్ని ప్రొఫెషనల్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలను ఆయన పంచుకొన్నారు.

రాణిలా ఉండే భార్య కోసం..

రాణిలా ఉండే భార్య కోసం..

ప్రస్తుతం నాకు సక్సెస్ లభిస్తున్నాయి. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి. కానీ గర్ల్‌ఫ్రెండ్ దొరకడం లేదు. మంచి గర్ల్‌ఫ్రెండ్ కోసం చూస్తున్నాను. నా జీవితంలో రాణిలా ఉండే భార్య కోసం ఎదురుచూస్తున్నాను. నా జీవితంలో చాలా మంది అమ్మాయిలు ఏడిపించారు.

 అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే

అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే

నేను అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చులకనగా చూస్తారు. అమ్మాయిలందరూ అంతే. నేను డిగ్రీ చదువుతుండగా ఓ అమ్మాయిని ప్రేమించాను. ఆమె యూఎస్‌లో చదువుకునేది. అప్పుడే అనుకొన్నాను నా జీవితంలో ఓ అమ్మాయి దొరికింది అని. ఇండియాకు వచ్చిన తర్వాత కలువలేదు. టెన్షన్ పడ్డాను. చాలా రోజుల తర్వాత వచ్చిన మెయిల్ ఓపెన్ చేస్తే ఆమె పెళ్లి ఫోటో కనిపించింది.

 అమ్మతో చెప్పుకొన్నాను..

అమ్మతో చెప్పుకొన్నాను..

నా ప్రేమ విఫలమైన విషయాన్ని అమ్మతో చెప్పుకొన్నాను. నాకు ముందే తెలిసు ఇలా అవుతుందని అమ్మ చెప్పింది. నీ కోసం మరో అమ్మాయి పుట్టి ఉంటుందిలే అని చెప్పింది. అది నా తొలిప్రేమ కాదు. లవ్‌లో పడటం ఫ్లాప్ అవ్వడం నా జీవితంలో మామూలైపోయింది. ఇప్పుడు బ్రేకప్ జరిగినా బాధగా ఉండటం లేదు.

సమంత అంటే

సమంత అంటే

నాకు సమంత అంటే చాలా ఇష్టం. ఏం మాయ చేసావేలో జెస్సీ అంటే బాగా ఇష్టం. సమంతకు కూడా జెస్సీ పాత్రలో నీవంటే ఇష్టమని నేను చెప్పాను. జెస్సీ పాత్రను బాగా లవ్ చేయడం వల్ల మరో అమ్మాయి నచ్చడం లేదో అనిపిస్తుంది.

 మామయ్యలకు ఎంతో రుణపడి

మామయ్యలకు ఎంతో రుణపడి

మెగా ఫ్యామిలీ నుంచి రావడం వల్ల నా గురించి ఏవోవో రాస్తుంటారు. నేను పట్టించుకోను. కానీ నాకు మా మామయ్యలకు ఎంతో రుణపడి ఉన్నానో నాకు తెలుసు. నేను వారిని ఎంతగా ప్రేమిస్తానో నాకు తెలుసు. చెర్రీ, బన్నీ, వరుణ్‌ను ఎంతగా ప్రేమిస్తానో నాకు తెలుసు. ప్రతీసారి నాకు నేను రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు. సినిమా ఫంక్షన్లో మాట్లాడకపోతే కొంత భజన అంటారు. మాట్లాడకపోతే బలుపు అనుకొంటాను.

 కామెంట్లను పట్టించుకోను

కామెంట్లను పట్టించుకోను

నేను సినిమా పరిశ్రమలోకి వచ్చినప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి మరోకడు వచ్చాడా.. రోజుకు ఒకడు వస్తున్నాడు అని అన్నారు. అలాంటి కామెంట్లును చూసి నిజమేగా అని నాకు నేను నవ్వుకున్నాను. వాటిని పెద్దగా పట్టించుకోను. నాకు టాలెంట్ లేకపోతే ఇక్కడ ఉండేవాడిని కాదు.

వర్మ ట్వీట్ల గురించి

వర్మ ట్వీట్ల గురించి

రాంగోపాల్ వర్మ ట్విట్టర్‌లో చేసే కామెంట్లను పెద్దగా పట్టించుకోను. ఆయన ఎవరినో కెలకడానికి అలా ట్వీట్ చేస్తారని అనుకొంటాను. వాటిని చాలా ఫన్నీగా తీసుకొంటాను. మేము పబ్లిక్ ఫిగర్లం. ఎవరైనా ఏమైనా అనవచ్చు. అద్దాలమేడపైనే రాళ్లు విసరడం సహజం కాదా. వాటిని సీరియస్‌గా పట్టించుకోను.

 క్రికెట్ ఆడటమంటే ప్రాణం

క్రికెట్ ఆడటమంటే ప్రాణం

క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం. సినిమాలు ఆడకపోతే రోడ్ సైడ్ బతుకే అనుకొన్నాను. అప్పుడు క్రికెట్ నాకు బ్యాకప్ ఉంటుంది అని ఫీలయ్యేవాడిని. ఎంబీఏ డిగ్రీ ఉన్నా దాని గురించి ఆలోచించే వాడిని కాదు. నాకు దారి చూపేది క్రికెటే అని భావించేవాడిని. సీసీఎల్‌ మ్యాచ్‌లు ఉప్పల్ స్టేడియంలో ఆడటం చాలా ఎక్ల్సైటింగ్ అనిపించింది.

 రెజీనాతో అఫైర్ గురించి

రెజీనాతో అఫైర్ గురించి

నాపై వచ్చే రూమర్లను, గాసిప్స్‌ను చాలా లైట్‌గా తీసుకొంటాను. రెజినాతో అఫైర్ అని, పెళ్లి కూడా అయిపోయింది అని రాసిన వార్తపై సాయిధరమ్ తేజ్ స్పందించారు. నిజమే రెజినాతో పెళ్లి జరిగింది. మా ఇద్దరికి ఇద్దరు పిల్లలు. పెద్దమ్మాయి నాల్గో తరగతి చదువుతున్నది. రెండో అమ్మాయి రెండో తరగతి చదువుతున్నది అని సాయిధరమ్ సెటైర్ వేశాడు.

 రాశీఖన్నా, రకుల్‌తో అఫైర్లు

రాశీఖన్నా, రకుల్‌తో అఫైర్లు

నాపై రూమర్లు కేవలం రెజీనాకే పరిమితం కాలేదు. రకుల్‌తో కూడా అఫైర్ ఉందని, రాశీఖన్నాతో ఉందని రాస్తున్నారు. రకుల్ పర్స్‌లో నా ఫొటో కూడా ఉందని రాశారు. అయితే రెజీనాతో పెళ్లి అయిన తర్వాత నా ఫోటో పర్సులో ఎందుకు పెట్టుకొన్నావని రకుల్‌ను అడిగాను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X