Don't Miss!
- News రాహుల్ సహా నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న కీలక నేతలు వీరే..
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
షూటింగ్లో సుప్రీం హీరో... మేకప్ రూంలో అందరితో అలా
ప్రస్తుతం సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. దాదాపు నాలుగైదు నెలల తరువాత సెట్స్‌పైకి వచ్చారు. ఈ మధ్య రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన సెట్లో దర్శనమిచ్చాడు. ప్రస్తుతం సాంగ్ షూట్ జరుగుతున్నట్టు కనిపిస్తోంది. నభ నటేష్ కూడా ఈ పాటలో జాయిన్ అయినట్టు తెలుస్తోంది. ఇన నభా షేర్ చేసే వీడియోలు, ఫోటోలను బట్టి చూస్తే షూటింగ్ ఎంత పకడ్బంధీగా జరుగుతోందో తెలుస్తోంది.
అసలే ఇది కరోనా కాలం. పైగా షూటింగ్.. చుట్టు పదుల మంది ఉంటారు. ఇలాంటి సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుది. అందుకే షూటింగ్ సెట్లో అందరూ మాస్కులు ధరించడం, పీపీఈ కిట్స్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటి జాగ్రత్తలను పాటిస్తున్నారు. ఇదే విషయాన్ని తేజు చెబుతూ తన పరిస్థితి ఎలా ఉందో ఓ ఫోటోను షేర్ చేశాడు. ఈ కొత్త జీవితానికి అలవాటు పడాల్సిందేనని సింబాలిక్‌గా చెబుతున్నట్టు కనిపిస్తోంది.
ఇది కొత్తది సాధారణమైన పోస్ట్ కోవిడ్ 19లో షూటింగ్.. షూటింగ్ లైఫ్ ఇలా ఉంటుంది.. ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ షూటింగ్లో ఉన్నాను.. కొత్త పద్దతులు.. కొత్తదే కానీ రొటీన్ అంటూ తన బాధను, సంతోషాన్ని తెలియజేశాడు. తన టీం మొత్తం తన చుట్టూ పీపీఈ కిట్స్ ధరించి ఉండగా తేజు మాత్రం అందర్నీ మిర్రర్ సెల్ఫీలో బంధించేశాడు. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన రెండు పాటలు (నో పెళ్లి, హే ఇది నేనేనా) ఓ రేంజ్లో క్లిక్కయ్యాయి.