twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షూటింగ్‌లో సుప్రీం హీరో... మేకప్ రూంలో అందరితో అలా

    |

    ప్రస్తుతం సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. దాదాపు నాలుగైదు నెలల తరువాత సెట్స్‌పైకి వచ్చారు. ఈ మధ్య రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన సెట్‌లో దర్శనమిచ్చాడు. ప్రస్తుతం సాంగ్ షూట్ జరుగుతున్నట్టు కనిపిస్తోంది. నభ నటేష్ కూడా ఈ పాటలో జాయిన్ అయినట్టు తెలుస్తోంది. ఇన నభా షేర్ చేసే వీడియోలు, ఫోటోలను బట్టి చూస్తే షూటింగ్ ఎంత పకడ్బంధీగా జరుగుతోందో తెలుస్తోంది.

    అసలే ఇది కరోనా కాలం. పైగా షూటింగ్.. చుట్టు పదుల మంది ఉంటారు. ఇలాంటి సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుది. అందుకే షూటింగ్ సెట్‌లో అందరూ మాస్కులు ధరించడం, పీపీఈ కిట్స్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటి జాగ్రత్తలను పాటిస్తున్నారు. ఇదే విషయాన్ని తేజు చెబుతూ తన పరిస్థితి ఎలా ఉందో ఓ ఫోటోను షేర్ చేశాడు. ఈ కొత్త జీవితానికి అలవాటు పడాల్సిందేనని సింబాలిక్‌గా చెబుతున్నట్టు కనిపిస్తోంది.

    Sai Dharam Tej Pic In SBSB Shooting Set

    ఇది కొత్తది సాధారణమైన పోస్ట్ కోవిడ్ 19లో షూటింగ్.. షూటింగ్ లైఫ్ ఇలా ఉంటుంది.. ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ షూటింగ్‌లో ఉన్నాను.. కొత్త పద్దతులు.. కొత్తదే కానీ రొటీన్‌ అంటూ తన బాధను, సంతోషాన్ని తెలియజేశాడు. తన టీం మొత్తం తన చుట్టూ పీపీఈ కిట్స్ ధరించి ఉండగా తేజు మాత్రం అందర్నీ మిర్రర్ సెల్ఫీలో బంధించేశాడు. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన రెండు పాటలు (నో పెళ్లి, హే ఇది నేనేనా) ఓ రేంజ్‌లో క్లిక్కయ్యాయి.

    English summary
    Sai Dharam Tej Pic In SBSB Shooting Set. The new normal post #covid19 shoots #sbsb #shootlife #newnorms #newroutine
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X