ఆ ఒక్కటి చూస్తే చాలు ఏదైనా చేయొచ్చు.. మెగా మేనళ్లుడి కామెంట్
ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే స్టార్స్.. ఫ్యామిలీతో కాస్త విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే కుటుంబ సభ్యులను తీసుకుని విదేశాలకు చెక్కేస్తాడు. మెగా ఫ్యామిలీ అయితే ప్రతీ పండగకు అందరూ ఒకే చోట కలుస్తూ ఉంటారు.
తాజాగా మెగా మేనళ్లుడు సాయి ధరమ్ తేజ్.. ఇంట్లో కూల్‌గా కూర్చున్నాడు. ఈ సుప్రీమ్ హీరో ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రతిరోజూ పండగే చిత్రాన్ని చేస్తోన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింప్స్ ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.

తాజాగా చిరు తన చిన్న కూతురు శ్రీజ, కళ్యాణ్ దేవ్ దంపతులకు జన్మించిన నవిష్కతో కాసేపు సరదాగా గడిపినట్టు ఉన్నాడు. బుల్లి మనవరాలిని చూసి చిరు మురిసిపోతున్నట్లు ఫోటోను చూస్తే అర్థమవుతోంది. నవిష్క నవ్వును చూస్తూ ఉన్న ఫోటోను సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఆ ఒక్క నవ్వును చూస్తే చాలు.. జీవితంలో దేని గురించైనా ఫైట్ చేసే బలం వస్తుందని పోస్ట్ చేశాడు. ఇక ఈ పోస్ట్‌కు రాశీ ఖన్నా, కళ్యాణ్ దేవ్‌లు రిప్లై ఇచ్చారు. అభిమానుల లైకులు, షేర్లతో ఆ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాయి ధరమ్ తేజ్ ప్రతిరోజూ పండగే అంటూ డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.


Click it and Unblock the Notifications











