తమ్మారెడ్డి విమర్శలపై సాయి ధరమ్ తేజ్ ఇలా...!

By Bojja Kumar

హైదరాబాద్: ‘మేము సైతం' కార్యక్రమానికి హాజరు కాని వారిపై ఇటీవల దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. హాజరు కాని వారిలో పవన్ కళ్యాణ్ కూడా ఉండటంతో ఈ విషయం హాట్ టాపిక్ అయింది. తిరుమలలో మీడియా కంటపడ్డ మెగా ఫ్యామిలీ హీరో, పవన్ కళ్యాణ్ మేనల్లుడు అయిన సాయి ధరమ్ తేజ్‌ను ఈ పాయింటప్ వ్యూలో విలేకరులు ప్రశ్నించారు.

దీనిపై సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ...మంచి విషయం కోసం ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. అయితే విమర్శల గురించి నాకు తెలియదు. వాటిని పట్టించుకోను. నేను కూడా మేముసైతం కార్యక్రమంలో డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాను' అంటూ మరో వివాదానికి తావివ్వకుండా దాటవేత ధోరణి ప్రధర్శించారు సాయి ధరమ్ తేజ్.

Sai Dharam Tej reaction about the Thammareddy Criticisms

ఇటీవల విడుదలైన ‘పిల్లా నువ్వు లేని జీవితం' విజయం సాధించడంతో ఆనందంగా ఉన్న సాయి ధరమ్ తేజ్ శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన తర్వాతి సినిమా గురించి చెప్పారు. దిల్ రాజు బేనర్లో హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' చిత్రం చేస్తున్నట్లు తెలిపారు.

ఇక తాను నటించిన తొలి సినిమా, ఇంకా విడుదల కాకుండా అలాగే ఉండి పోయిన, వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించిన ‘రేయ్' విడుదల ఎప్పుడు అని అడగ్గా...ఈ సినిమా విడుదలపై వైవిఎస్ చౌదరే ప్రకటన చేస్తారని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X