''లవ్ యు పవన్ మామ..'' పవర్ స్టార్‌పై మెగా మేనల్లుడి కామెంట్

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తన మేనమామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని ''లవ్ యు పవన్ మామ..'' అనేశారు. పవన్ కళ్యాణ్‌ అందించిన శుభాకాంక్షలపై రియాక్ట్ అవుతూ సాయి ధరమ్ తేజ్ ఈ ట్వీట్ చేశాడు.

సాయి ధరమ్ తేజ్ హీరోగా నారుతి దర్శకత్వంలో తెరకెక్కిన 'ప్రతిరోజు పండగే' మూవీ డిసెంబర్ 20న విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మెగా మేనల్లుడి ఖాతాలో హిట్ సినిమాగా రికార్డ్ అయిన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టి నిర్మాతలకు లాభాల పంట పండించింది. చిత్రంలో సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా నటనకు మంచి మార్కులు పడ్డాయి.

Sai Dharam Tej reaction on Pawan Kalyan tweet

ఈ సందర్బంగా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్.. సాయి ధరమ్ తేజ్‌కు స్పెషల్‌గా అభినందనలు తెలిపారు. రకరకాల పూలతో కూడిన బొకే షేర్ చేస్తూ 'డియర్ సాయి ధరమ్ తేజ్ ఇటీవలే విజయం సాధించిన 'ప్రతిరోజు పండగే' చిత్రానికి మరియు నీ భవిష్యత్తులో చేయబోయే ప్రయత్నాలకు కూడా శుభాకాంక్షలు' అని పేర్కొన్నారు.

మేనమామ పవన్ అభినందనలకు సాయి ధరమ్ తేజ్ పొంగిపోయారు. ఈ మేరకు అదే సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతూ 'మాట్లాడటానికి పదాలు తక్కువయ్యాయని అనిపిస్తోంది. ఈ సమయంలో థాంక్యూ అనే పదం కూడా చిన్నదైపోతుంది. లవ్ యు పవన్ కళ్యాణ్ మామ' అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాలో నటిస్తున్నాడు సాయి ధరమ్ తేజ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X