Just In
- 40 min ago
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు: ఫస్ట్ డే రెస్పాన్స్.. వర్మ షాకింగ్ రియాక్షన్
- 57 min ago
అర్జున్ రెడ్డి భామకు బంపర్ ఆఫర్.. ఇక అతగాడితో ముద్దుల వర్షమే!
- 1 hr ago
గుడ్ బై చెప్పాలనుకున్నా.. ఎన్టీఆర్, ప్రభాస్‌లతో! అసలు విషయం బయటపెట్టిన వెంకటేష్
- 2 hrs ago
మొత్తానికి ఫైనల్ చేశారు.. ఇక బాలకృష్ణ కష్టాలకు ఫుల్స్టాప్ పడినట్లేనా?
Don't Miss!
- News
చంద్రబాబు, లోకేశ్ మానసిక రోగులు, పీక కట్టుకొమ్మని కుమారుడికి చెప్తున్నారా:జోగి రమేశ్
- Sports
క్రీజు వదిలిపోను.. పఠాన్, రహానే మధ్య వాగ్వాదం వీడియో!!
- Finance
సినిమా, సాఫ్టువేర్, పెట్రోలియం... 10ఏళ్ల ట్యాక్స్ హాలీడే: ఏపీ, తెలంగాణ వ్యాపారవేత్తలకు బంపరాఫర్!
- Technology
లాంగ్ టర్మ్ ప్యాక్‌లను తొలగించిన DTH ఆపరేటర్లు
- Lifestyle
శుక్రవారం మీ రాశిఫలాలు 13-12-2019
- Automobiles
2019 లో 10 టాప్ మోస్ట్ గూగిల్డ్ కార్స్
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
హీరోయిన్లనే కాదు.. చుట్టుపక్కల అమ్మాయిలనూ పట్టించుకోండి.. సాయి ధరమ్ తేజ్ రియాక్షన్
నేటి సమాజంలో సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగింది. ఈ సోషల్ మీడియా కారణంగా ప్రపంచం చిన్నదైపోయింది. ముఖ్యంగా సెలబ్రిటీలకు, సాధారణ ప్రజలకు మధ్య దూరం బాగా తగ్గింది. అయితే కొందరు నెటిజన్ల తీరు మాత్రం పలువురు సెలబ్రిటీలను అసంతృప్తికి గురిచేస్తోంది. ఈ కోవలోనే ఇటీవలే సాయి ధరమ్ తేజ్‌పై ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై రియాక్ట్ అవుతూ సందేశమిచ్చారు ఈ మెగా మేనల్లుడు. వివరాల్లోకి పోతే..

రాశి ఖన్నా మీద చేయి.. మెగా మేనల్లుడిపై ట్రోల్స్
ఇటీవల జరిగిన రాశి ఖన్నా పుట్టినరోజు సందర్బంగా రాశి ఖన్నా, సాయి ధరమ్ తేజ్ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఆ ఫొటోల్లో వారిద్దరూ చాలా క్లోజ్‌గా కనిపించారు. దీంతో ఆ ఫొటోలు చూసిన కొందరు నెటిజన్లు రాశి ఖన్నా మీద చేయి తీయమని సాయి ధరమ్ తేజ్‌పై ట్రోల్స్ చేశారు. ఇదే అంశంపై తాజాగా దిమ్మతిరిగే రియాక్షన్ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్.

మీ చుట్టూ ఉన్న అమ్మాయిల విషయంలో..
‘‘హీరోయిన్ విషయంలోనే కాదు.. మీ చుట్టూ ఉన్న అమ్మాయిల విషయంలో కూడా బాధ్యతగా ప్రవర్తించండి'' అంటూ ఘాటుగా మెసేజ్ పెట్టాడు సాయి ధరమ్ తేజ్. హీరోయిన్ మీద చూపించిన బాధ్యత.. చుట్టూ ఉన్న అమ్మాయిల విషయంలో కూడా చూపితే.. ఎలాంటి అత్యాచార ఘటనలూ జరగవని ఆయన ట్వీట్ చేశారు.
|
హీరోయిన్ మీద చెయ్యి వేస్తేనే అలా అన్నారు మరి..
‘‘ఇవన్నీ నన్ను ఆలోచనలో పడేశాయి. మీ అభిమాన హీరోయిన్ మీద చెయ్యి వేస్తేనే.. 'చేయి తీయ్' అన్నారు. అది సినిమాలో భాగమని తెలిసి కూడా మీరు స్పందించారు. అంతే ప్రేమ, బాధ్యత మీ చుట్టూ ఉన్న అమ్మాయిల మీద కూడా చూపిస్తే మన సమాజంలో ఎలాంటి అత్యాచార ఘటనలూ జరగవు కదా'' అని
తన ట్వీట్‌లో పేర్కొన్నాడు సాయి ధరమ్ తేజ్.

సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా.. ప్రతి రోజు పండగే
ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా ‘ప్రతి రోజు పండగే' సినిమా తెరకెక్కుతోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సత్యరాజ్, విజయకుమార్, రావు రమేష్, మురళీ శర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, సత్య శ్రీనివాస్, సుభాష్, భరత్ రెడ్డి, గాయత్రీ భార్గవి, హరితేజ, మహేష్, సుహాస్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.