Pawan మూడు పెళ్లిళ్లపై Sai Tej షాకింగ్ కామెంట్స్.. అందుకే మెగా ఫ్యామిలీ దీని గురించి మాట్లాడదా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే... మరోవైపు సినిమాల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే రాజకీయాల్లో ఉండే వారికి విమర్శలు, ప్రతి విమర్శలు తప్పవు. ఇక పవన్ విషయంలో కూడా అదే జరుగుతుందని చెప్పవచ్చు. వైసీపీ నాయకులు పవన్ కల్యాణ్ ను ప్యాకేజీ స్టార్ అంటూ... మూడు పెళ్లిళ్లు అంటూ విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే మొదటిసారిగా ఈ విషయంపై ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ స్పందించాడు. ఆ వివరాల్లోకి వెళితే

విమర్శలు కామన్..: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ బ్రో. ఈ మూవీ ఈ శుక్రవారం రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. పవన్ కల్యాణ్ మూవీ హిట్ కావడంతో అటు జనసేన నాయకుల్లో కూడా ఫుల్ జోష్ వచ్చింది. అయితే పవన్ రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. రాజకీయాల్లో భాగంగా పవన్ ను పర్సనల్ గా టార్గెట్ చేస్తూ విపక్షాలు కామెంట్ చేస్తూ ఉంటాయి. ఇవన్నీ సహజమే.

Sai Dharam

తొలిసారిగా రియాక్ట్..: అయితే పవన్ కల్యాణ్ ను వైసీపీ నాయకులు ప్యాకేజీ స్టార్, మూడు పెళ్లిళ్లు అంటూ అనేక విమర్శలు చేస్తూ ఉంటారు. దీనిపై ఒక్క నాగబాబు తప్ప... మెగా కుటుంబం నుంచి ఎప్పుడూ, ఏనాడు ఎవరు స్పందించింది లేదు. అయితే తాజాగా సాయి ధరమ్ తేజ్... బ్రో మూవీ ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇక పవన్ కల్యాణ్ పై వస్తున్న ఈ విమర్శలపై తొలిసారిగా సాయి తేజ్ స్పందించాడు.

సాయి తేజ్ ఆవేదన..: పవన్ కల్యాణ్ పై మూడు పెళ్లిళ్లు, ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు అంటూ వైసీపీ వాళ్లు విమర్శలు చేస్తుంటారు. మీకు కోపం రాదా? మీరు ఎందుకు రియాక్ట్ అవ్వరు? ఎలా అనిపిస్తుంది మీకు.. అని యాంకర్.. తేజ్ ను అడిగారు. దీనిపై స్పందించిన తేజ్.. షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజకీయాల గురించి నేను మాట్లాడలేను కానీ మావయ్యను అలాంటి మాటలు అంటుంటే చాలా బాధగా అనిపించేది.. అని ఆవేదన వ్యక్తం చేశాడు.

Sai Dharam

పవన్ పిలిచి మరీ..: ఇక సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ... అయితే మావయ్య రాజకీయాల్లోకి రాకముందే నన్ను చరణ్ ను, వైష్ణవ్ తేజ్ ను, వరుణ్ తేజ్ ను, ఇంకా మా ఫ్యామిలీలో కొంతమందిని పిలిచి మాట్లాడారు. ''నేను రాజకీయాల్లోకి వెళ్తున్నాను.. నాపై చాలా విమర్శలు వస్తాయి. అంతేకాదు ఫ్యామిలీని కూడా తిడతారు. అవేమీ మీరు పట్టించుకోకండి. వాటికి అస్సలు మీరు స్పందించొద్దు. వాటిపై మీరు రియాక్ట్ అవ్వద్దు. ఈ విషయంలో మాత్రం నా మాట వినండి'' అంటూ పవన్ చెప్పారట.

Sai Dharam

అందుకే రియాక్ట్ అవ్వట్లేదు...: అంతే కాదు.. ''నన్ను క్షమించండి. నన్ను ఎవరు ఏమన్నా... మీరు కచ్చితంగా రియాక్ట్ అవుతారని నాకు తెలుసు. అందుకే ఇలా పిలిచి మరీ చెప్తున్నా... నాకోసం మీరు కంగారు పడనవసరం లేదు. నన్ను నేను కాపాడుకుంటాను. మీ సపోర్ట్ నాకు ఉంటుంది.. అంటూ చెప్పుకొచ్చాడట పవన్ కళ్యాణ్. అలా పిలిచి మరి రాజకీయాల్లో ఏమన్నా పట్టించుకోవద్దు అని చెప్పారని కాబట్టే తాము స్పందించమని చెప్పాడు తేజ్.

అందుకే మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ రియాక్ట్ అవ్వట్లేదని తెలుస్తుంది. కానీ ఇలా మావయ్యను మూడు పెళ్లిళ్లు, ప్యాకేజీ స్టార్ అంటుంటే చాలా బాధగా ఉంటుందని తేజ్ చెప్పాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X