మరో మెగా రీమిక్స్: మెగా మేనల్లుడితో వివి వినాయక్ ప్రయోగం!
మెగా ఫ్యామిలీలో చిరంజీవి పోలికలు ఎవరికి వచ్చాయి అంటే..... అందరూ తేజ్ పేరే చెబుతారు. మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ యంగ్ ఏజ్‌లో చిరంజీవి ఎలా ఉన్నారో అచ్చుగుద్దినట్లు అలానే ఉంటాడు. మామయ్య వారసత్వంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ చాలా విషయాల్లో ఆయన్ను ఫాలోఅవుతున్నాడు. మామయ్య సినిమాల్లోని పాటలను తన సినిమాల్లో వరుసగా రీమిక్స్ చేస్తున్న తేజ్... మరోసారి అలాంటి ప్రయత్నం చేయబోతున్నారు.
Recommended Video


వినాయక్ దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్
సాయి ధరమ్ తేజ్ త్వరలో వివి వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. వినాయక్ సినిమా అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెగా అభిమానులకు ఏం కావాలో అలాంటి స్టఫ్‌తో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు.

మరో రీమిక్స్ సాంగ్
మెగాస్టార్ చిరంజీవి కొండవీటి దొంగ సినిమాలోని ఛమకు ఛమకు ఛామ్ అనే పాట అప్పట్లో మార్మోగి పోయింది. ఇపుడు అదే పాటను సాయి ధరమ్ తేజ్ సినిమాలో రీమిక్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు వినాయక్.

చిరంజీవి-విజయశాంతి జోడీ సంచలనం
కొండవీటి దొంగ సినిమాలోని ఆ పాటను ఇళయరాజా స్వరపరిచారు. అప్పట్లో హీట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న చిరంజీవి-విజయశాంతి ఈ పాటకు స్పెప్పులేశారు. మరి ఇపుడు వినాయక్ సినిమాలో సాయి ధరమ్ తేజ్ ఎవరితో కలిసి ఈ సినిమాలో స్టెప్పులు వేస్తారో చూడాలి.

ధర్మా భాయ్
వివి వినాయక్-సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘ధర్మాభాయ్' అనే టైటిల్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











