For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రెండింగ్: శ్రీదేవి మృతికి కారణం ఆమేనట.. నాని మాటకు ఏడుపొచ్చింది... ముదురు హీరోతో రకుల్..

|

అతిలోక సుందరి శ్రీదేవి గత ఏడాది మరణించిన సంగతి తెలిసిందే. శ్రీదేవి మృతి కారణం ప్రియా ఆనంద్ అంటూ ఓ నెటిజన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. జూనియర్ ఆర్టిస్టులని బూతులు తిడుతున్నాడు అంటూ స్టార్ డైరెక్టర్ అట్లీపై కేసు నమోదైంది. తనపై వస్తున్న రూమర్లపై సాయిధరమ్ తేజ్ మరోమారు స్పందించాడు. చెల్లి లాంటి నిహారికని పెళ్లి చేసుకుంటావా అని అడిగితే కాలదా అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చాడు. సీనియర్ హీరో అజయ్ దేవగన్ తో రకుల్ ప్రీత్ రొమాన్స్ హాట్ టాపిక్ గా మారుతోంది. మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం కాపీ అంటూ కేసు తీర్పు ఇచ్చింది. హర్షవర్ధన్ రాణే, కిమ్ శర్మ తమ రిలేషన్ షిప్ కు బ్రేకప్ చెప్పేశారు. ఇలాంటి హాట్ న్యూస్ ఈ వారం ట్రెండింగ్ గా నిలిచాయి.

శ్రీదేవి మృతికి కారణం ఈ హీరోయినే.. మరో నటుడు కూడా.. ఆమెతో నటిస్తే ఇక అంతే!

హీరోయిన్ ప్రియా ఆనంద్ సినీ అభిమానులకు గుర్తుండే ఉంటుంది. రానా దగ్గుబాటి, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో వచ్చిన లీడర్ చిత్రంలో ప్రియా ఆనంద్ హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ప్రియా ఆనంద్ రామ రామ కృష్ణ కృష్ణ, 180 లాంటి చిత్రాల్లో నటించింది. పలు తమిళ చిత్రాల్లో కూడా ప్రియా ఆనంద్ అవకాశాలు అందుకుంది. తెలుగులో ప్రియా ఆనంద్ కు ప్రస్తుతం అవకాశాలు లేవు. తమిళంలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. సోషల్ మీడియాలో ఓ నెటిజన్ తనని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకు ప్రియా ఆనంద్ ఘాటుగా సమాధానం ఇచ్చింది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

స్టార్ హీరోని నిలదీసిన మహిళలు, అదుపు తప్పిన పరిస్థితి.. వైరల్ అవుతున్న వీడియో!

ఇటీవల తమిళనాడులో ఎన్నికలు ముగిశాయి సెలెబ్రిటీలంతా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. కొన్ని చెదురు ముదురు సంఘటనలు మినహా తమిళనాడులో పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది. స్టార్ హీరో అజిత్ కు తమిళనాడులో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అభిమానులు అతడి వాహనాల వెంటపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అజిత్ తన సతీమణి షాలినితో కలసి తిరువాన్మయూర్ పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వివాదంగా మారుతోంది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

భోజనం, టాయిలెట్లు కావాలని అడిగితే.. బూతులు తిట్టిన క్రేజీ డైరెక్టర్.. కేసు నమోదు చేసిన నటి!

మూడు బ్లాక్ బస్టర్ విజయాలతో దక్షిణాదిలో అట్లీ క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు. అతడు తెరకేకించిన రాజా రాణి, తేరి, మెర్సల్ చిత్రాలు ఘనవిజయం సాధించాయి. ప్రస్తుతం అట్లీ, విజయ్ హ్యాట్రిక్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతోంది. క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ కి జోడిగా నయనతార నటిస్తోంది. తన ప్రతి చిత్రంలో ఏదో ఒక సందేశాత్మక అంశాన్ని జోడించడం అట్లీ ప్రత్యేకత. ఈ టాలెంటెడ్ యువదర్శకుడు తాజాగా వివాదంలో చిక్కుకున్నాడు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

చెల్లిని పెళ్లి చేసుకుంటావా అంటే కాలదా.. నిహారిక గురించి రూమర్స్.. సాయిధరమ్ తేజ్!

ఆరు వరుస పరాజయాల తర్వాత సాయిధరమ్ తేజ్ ఓ విజయం అందుకున్నాడు. తేజు నటించిన చిత్రలహరి చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్రలహరి చిత్రానికి మంచి వసూళ్లు లభించాయి. దర్శకుడు కిషోర్ తిరుమల యువతకు నచ్చే అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. సాయిధరమ్ తేజ్ సరసన ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్, నివేద పెతురాజ్ హీరోయిన్లుగా నటించారు. సాయిధరమ్ తేజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనపై వస్తున్న రూమర్లపై హాట్ కామెంట్స్ చేశాడు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

తల పొగరుతో భోజనాన్ని కాలితో తన్నింది, ఫలితం అనుభవించింది.. సీనియర్ నటి జానకి!

డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటిగా జానకి వందలాది చిత్రాల్లో నటించింది. సాగర సంగమం, స్వాతి ముత్యం, గీతాంజలి లాంటి ఎన్నో చిత్రాల్లో జానకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆమె నటించిన చిత్రాలు 700కు పైగా ఉంటాయి. తన భర్త మిలటరీ వ్యక్తి అని, తాను కూడా ఎంతోకొంత సంపాదించడానికి సినిమాల్లోకి వచ్చానని జానకి తెలిపారు. జానకి నటించిన తొలి చిత్రం భూ కైలాస్. అలీతో సరదాగా కార్యక్రమంలో ఇటీవల జానకి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జానకి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరించారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

రెచ్చిపోయిన రకుల్ ప్రీత్.. ముదురు హీరోతో రొమాన్స్.. బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా

బాలీవుడ్‌లో దే దే ప్యార్ దే చిత్రం విడుదలకు ముందే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచుతున్నది. ప్రధానంగా అజయ్ దేవగన్‌, రకుల్ ప్రీత్ సింగ్ రొమాన్స్, కెమిస్ట్రీ సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇటీవల విడుదలైన వడ్డీ షరాబన్ పాట యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. తాజాగా విడుదల చేసిన తూ మిలా తో హైనా అనే పాటలో వీరిద్దరి కెమిస్ట్రీ హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

జూనియర్ ఎన్టీఆర్‌కు గాయం.. RRR యూనిట్‌కు మరో షాక్

బాహుబలి తర్వాత దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన RRR చిత్రానికి ప్రతికూల పరిస్థితులు ఎక్కువగానే ఎదురువుతున్నాయి. షూటింగ్ సరిగా జరుగుతూ అంతా సవ్యంగా సాగుతుందనే సమయంలో రాంచరణ్‌ గాయం కావడం, ఆ తర్వాత వెంటనే సినిమా నుంచి ఓ హీరోయిన్ డైసీ ఎడ్గర్ జోన్స్ తప్పుకోవడం గందరగోళంగా మారాయట. తాజాగా ఎన్టీఆర్ గాయపడిన వార్త మీడియాలో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

రాజమౌళికి షాకిచ్చిన బాలీవుడ్ హీరోయిన్.. జక్కన ఆఫర్‌కు నో!

ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న RRR సినిమాకు సంబంధించి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి మరోసారి చుక్కెదురైంది. ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ నుంచి బ్రిటీష్ అందాల సుందరి డైసీ ఎడ్గర్ జోన్స్ తప్పుకొన్న తర్వాత మరో హీరోయిన్ కోసం జక్కన్న వేట ప్రారంభించారు. శ్రద్ధాకపూర్, పరిణితి చోప్రా లాంటి పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ప్రస్తుతం సాహో చిత్రంలో నటిస్తున్న శ్రద్ధాకపూర్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే ఈ సినిమా ఆఫర్‌ను ఆమె తిరస్కరించినట్టు వచ్చిన వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే...

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

రకుల్ ప్రీత్‌కు షాక్... హాట్ సినిమాకు ముఖం చాటేసిన బయర్లు?.. గందరగోళంలో నిర్మాత.. కారణం ఏమిటంటే

దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్‌లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు హీరో అజయ్ దేవగన్‌తో జతకట్టింది. రొమాంటిక్ కామెడీ చిత్రంగా రూపొందిన ఈ సినిమా ట్రైలర్లు, వీడియో సాంగ్స్ రిలీజై సినీ అభిమానులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఈ సినిమాలోని అజయ్, రకుల్ ప్రీత్ సింగ్ మధ్య కెమిస్ట్రీ హాట్ టాపిక్‌గా మారింది. దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకొన్న ఈ చిత్రాన్ని కొనుగోలు చేయడానికి బయర్లు వెనుకాడటంపై బాలీవుడ్‌లో భారీ చర్చ జరుగుతున్నది. అందుకు కారణం ఏమిటంటే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

15 ఏళ్ల కల చెదిరింది.. కరణ్‌ జోహర్‌కు భారీ దెబ్బ.. కళంక్ థియేటర్లన్నీ ఖాళీ.. ఎంత నష్టమంటే

బాలీవుడ్‌లో భారీ బడ్జెట్, హై ప్రొఫైల్ యాక్టర్లతో రూపొందిన కళంక్ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులు చుక్కలు చూపించారు. ఇప్పటికే థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమా ఫ్లాప్‌తో బేజారెత్తిన బాలీవుడ్‌కు కళంక్ రూపంలో మరో భారీ జట్కా తగిలింది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం పేలవమైన ప్రదర్శన కారణంగా దారుణమైన వసూళ్లు నమోదవుతున్నాయి. అలియాభట్, వరుణ్ ధావన్, ఆదిత్య రాయ్ కపూర్, సోనాక్షి సిన్హా, మాధురి దీక్షిత్, సంజయ్ దత్ లాంటి అగ్ర తారలు నటించిన సినిమాను ప్రేక్షకులు తిరస్కరించడం ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే...

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

కారులేదు.. జూ ఎన్టీఆర్ అప్పుడు సొంత ఆటోలో తాతను కలిసేందుకు వెళ్లేవాడట!

తాతయ్య ఎన్టీ రామారావు వాసరత్వంతో సినిమాల్లో రావడమే కాదు.. ఆయన పేరు బెట్టిన మనవడిగా గుర్తింపు తెచ్చుకున్నారు జూ ఎన్టీఆర్. ఏదైనా సందర్భంలో తాతయ్యను గుర్తు చేసుకోవాల్సి వస్తే భావోద్వేగానికి గురవుతుంటాడు యంగ్ టైగర్. చిన్నప్పుడు ఏమీ తెలియని వయసులో తాతయ్య అంటూ తిరిగేవాడిని...ఆయన గురించి తెలిశాక రామారావు గారు, అన్నగారు అంటూ పిలవాలనిపించేది అంటూ గతంలో ఓ సందర్భంలో యంగ్ టైగర్ వ్యాఖ్యానించారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

అమ్మా నాన్న విడాకులపై స్పందించిన సాయి ధరమ్ తేజ్, ఏం జరిగిందంటే?

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ జీవితంలో చాలా మందికి తెలియని ఒక సాడ్ పార్ట్ ఉంది. దాదాపు పదిహేనేళ్ల క్రితమే వాళ్ల అమ్మానాన్న విడిపోయారు. అప్పటి నుంచి వాళ్ల అమ్మగారే అన్నీ తానై సాయి ధరమ్ తేజ్, అతడి సోదరుడిని పెంచారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తేజ్ ఈ విషయంపై స్పందించారు. ''వారు కలిసి ఉండటం కుదరలేదు. నేను 10వ తరగతిలో ఉన్నపుడే విడాకులు తీసుకున్నారు. దాని గురించి మరిచిపోయి జీవితాన్ని ముందుకు సాగించాం'' అని తెలిపారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

‘Mr పెర్ఫెక్ట్' కాపీ అని తేల్చిన కోర్టు: చిక్కుల్లో దిల్ రాజు, దశరథ్

ప్రభాస్ హీరోగా దశరథ్ దర్శకత్వంలో రూపొందిన 'Mr పర్ఫెక్ట్' 2011లో విడుదలై మంచి విజయం అందుకుంది. అయితే ఈ మూవీ కథ 2010లో విడుదలైన 'నా మనసు కోరింది నిన్నే' అనే నవల నుంచి కాపీ కొట్టిందనే ఆరోపణలు రావడంతో విషయం కోర్టు వరకు వెళ్లింది. దీనిపై రచయిత ముమ్ముడి శ్యామల దేవి చేస్తున్న న్యాయపోరాటం ఎట్టకేలకు ఫలించింది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

నాని రెమ్యూనరేషన్ వద్దన్నాడు, కన్నీళ్లు వచ్చాయి, ఇక్కడ ఎవ్వడూ అతీతుడు కాదు: దిల్ రాజు

నాని హీరోగా న‌టించిన జెర్సీ ఏప్రిల్ 19న విడుదలై బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతోంది. చాలా కాలం తర్వాత తెలుగులో ఒక మంచి సినిమా వచ్చిందనే అభిప్రాయం ప్రతి ఒక్కరి నుంచి వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి కారణమైన చిత్ర బృందాన్ని అభినందించడానికి అప్రిషియేట్ మీట్ ఏర్పాటు చేశారు ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హీరో నాని గురించి ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ప్రేమ పెటాకులైంది... తెలుగు హీరోను వదిలేసిన బాలీవుడ్ బ్యూటీ?

తెలుగు హీరో హర్షవర్ధన్ రాణె కొంతకాలంగా బాలీవుడ్ బ్యూటీ కిమ్ శర్మతో ప్రేమాయణం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. సహజీవనం చేస్తున్న ఈ హాట్ పెయిర్ ముంబైలో జరిగే పార్టీలు, పంక్షన్లలో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ హల్ చల్ చేస్తూ మీడియాకెక్కారు. అయితే వీరి బంధం ఎంతోకాలం నిలవలేదు. బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం ఈ ఇద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవలే వీరి మధ్య గొడవ జరిగిందని, అప్పటి నుంచి మాట్లాడు కోవడం లేదని, మళ్లీ కలిసే అవకాశాలు లేవనే వార్తలు వినిపిస్తున్నాయి.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Heroine Priya Anand gives fitting reply to netizen who blames her for Sridevi death. Sai Dharam Tej Responds on his Mother and Father divorce. Rakul preet Singh romance with Ajay Devgn became hot topic.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more