ఆమె కెరీర్ నాశనం కాకూడదనే.. రెజీనాతో ఎఫైర్ గురించి సాయి ధరమ్ తేజ్!
సాయిధరమ్ తేజ్ వరుసగా సినిమాల్లో నటిస్తూ తన పని తాను చేసుకుంటున్నాడు. కానీ రెజీనాతో లవ్ ఎఫైర్ రూమర్ మాత్రం తేజుని విడిచిపెట్టడం లేదు. తేజు ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్నా రెజీనా గురించి ప్రశ్న ఎదురవుతూనే ఉంటుంది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రలహరి చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ఏప్రిల్ 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీనితో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలని ప్రారంభించింది. తేజు ఓ ఇంటర్వ్యూలో పరోక్షంగా రెజీనాతో ఎఫైర్ అంటూ వస్తున్న వార్తలపై స్పందించాడు.

తొలి చిత్రం
సాయి ధరమ్ తేజ్ నటించిన తొలి చితం పిల్ల నువ్వులేని జీవితంలో రెజీనా హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత వీరిద్దరూ జంటగా సుబ్రహ్మణ్యం ఫర్ సెల్, నక్షత్రం చిత్రాల్లో నటించారు. వీరిద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా కుదిరింది. వీరిద్దరి మధ్య ఎఫైర్ సాగుతోందంటూ రూమర్స్ మొదలైపోయాయి. ఈ విషయం గురించి సాయి ధరమ్ తేజ్ పూర్తిగా సమాధానం ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడు.

నా కెరీర్ నాశనం అయింది
ఆ మధ్యం రెజీనా ఓ ఘాటైన కామెంట్ చేసింది. ఓ హీరో వలన తన కెరీర్ నాశనమైందని రెజీనా వ్యాఖ్యానించింది. దీనితో రెజీనా చేసిన వ్యాఖ్యలు తేజు గురించే అని అంతా ప్రచారం జరిగింది. వీరిద్దరూ ఘాడమైన ప్రేమలో మునిగితేలిన తర్వాత బ్రేకప్ అయ్యారని వార్తలు వచ్చాయి. రెజీనా కామెంట్స్ పై తేజు పరోక్షంగా స్పందించాడు. నా క్లోజ్ ఫ్రెండ్ అయినంత మాత్రాన ఆమె వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం సరికాదని తెలిపాడు.

అందుకే దూరంగా
తాజాగా ఇంటర్వ్యూలో రెజీనా గురించి పరోక్షంగా మాట్లాడుతూ.. ఆమె నా తొలి చిత్ర హీరోయిన్. కాబట్టి ఆమెపై గౌరవం ఎప్పటికి ఉంటుంది. మా మధ్య ఏదో జరుగుతున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్ వలన ఆమె కెరీర్ నాశనం కాకూడదనే ఇద్దరం దూరంగా ఉంటున్నట్లు సాయిధరమ్ తేజ్ పేర్కొన్నాడు. ఆమె ఎప్పటికి నాకు స్నేహతురాలే. మా మధ్యన ఎలాంటి ఎఫైర్ లేదు. అది రూమర్ మాత్రమే అని తేజు క్లారిటీ ఇచ్చాడు.

చిత్రలహరితో
మరికొద్ది రోజుల్లో తేజు చిత్రలహరి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కిషోర్ తిరుమల ఎంటైర్ టైనింగ్ అంశాలతో ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తేజు సరసన నివేద పెతురాజ్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్నాడు. సునీల్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తూ కామెడీ పండించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.


Click it and Unblock the Notifications











