twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగా హీరో సాయి ధరమ్ తేజ ‘రేయ్’ అప్డేట్స్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ హీరోగా ప్రముఖ దర్శకుడు వైవిఎస్ చౌదరి 'రేయ్' అనే చిత్రం రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రారంభమై దాదాపు 2 సంవత్సరాలు గడిచి పోయింది. ఆ మధ్య ఆర్థిక సమస్యలతో వైవిఎస్ చౌదరి ఈచిత్రాన్ని పక్క పెట్టారు. కొన్ని నెలల నుంచే మళ్లీ షూటింగ్ ప్రారంభమైంది.

    ఈ చిత్రం తాజా అప్డేట్స్ విషయానికొస్తే...ప్రస్తుతం 'రేయ్' చిత్రం ఫైనల్ స్టేజిలో ఉంది. ట్రినిడాడ్-టొబాగోల్లో షెడ్యూల్ పూర్తయిన తర్వాత చిత్ర యూనిట్ తర్వాతి పోర్షన్ పూర్తి చేయడానికి లాస్ వెగాస్ బయల్దేరి వెళ్లారు. ఈ చిత్రం ద్వారా సయామీ ఖేర్ అనే భామ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. అదే విధంగా హీరోయిన్ శ్రద్ధాదాస్ ఈ చిత్రంలో పర్మినెంట్ రోల్ పోషిస్తోంది.

    వైవిఎస్ చౌదరి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రానికి చక్రి సంగీతం అందిస్తుండగా, గుణశేఖరన్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. 2013లో ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. సినిమాపై అంచనాలు పెంచేందుకు ఈచిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లను సంబంధించిన విషయాలు పొందు పరుస్తున్నట్లు తెలుస్తోంది.

    మెగా కుటుంబం నుంచి వస్తున్న మరో హీరో కావడంతో...మెగా అభిమానులంతా సాయి ధరమ్ తేజ పరిశ్రమలో నిలదొక్కుకునేలా చేసేందుకు నడుం భిగించారు. 'రేయ్' సినిమా ప్రమోషన్లు ప్రారంభం కాగానే సాయి ధరమ్ తేజ్ గురించి సోషల్ నెట్వర్కింగ్ సైట్ ద్వారా పాజిటివ్ టాక్ వ్యాపింప చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    The marathon US schedule of Sai Dharam Tej and Saiyami Kher starrer Rey has entered the final stage. After wrapping up two weeks schedule in Trinidad & Tobago, the film unit has moved to Las Vegas to shoot remaining portions of scenes in this schedule. Chakri is composing the music. YVS Chowdary is producing and directing the movie as well.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X