కరుణాకరణ్ సినిమాలో సాయి ధరమ్ తేజ్ పాత్ర ఇదే!
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న తాజా సినిమాకు కరుణాకరనణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తేజ్ ఐ లవ్ యు పేరుతో తెరకేక్కబోయే ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదల అయ్యింది. పక్కా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డార్లింగ్ తరహలోని ఒక అందమైన ప్రేమకథను కరుణాకరన్ చెప్పబోతున్నాడని సమాచారం
క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ బ్యానర్ నుంచి 45వ సినిమా గా తేజ్ ఐ లవ్ యు నిర్మితమవుతోంది. డార్లింగ్ స్వామి మాటలు రాస్తున్న ఈ సినిమాకు ఆండ్రూ కెమెరామెన్ గా పని చేస్తున్నాడు.

ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సెంటిమెంట్స్, ఎమోషన్స్ కలిసిన యూత్‌ఫుల్ లవ్‌స్టోరీగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. సాయిధరమ్‌తేజ్ ఈ సినిమాలో చదువు పూర్తి చేసిన యంగ్ స్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జయప్రకాష్, పవిత్ర లోకేష్, పృథ్వీ, కాశీవిశ్వనాథ్, సురేఖావాణి, వైవా హర్ష, జోష్ రవి, ఐశ్వర్య, రాజా, భరత్‌రెడ్డి, కార్తీక్, అభిషేక్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











