సాయి ధరమ్ తేజ్ ‘చిత్రలహరి’ ట్విట్టర్ రివ్యూస్... టాక్ ఎలా ఉందంటే?

Recommended Video

Chitralahari Movie Twitter Review | Sai Dharam Tej | Kalyani Priyadarshan | Sunil | Filmibeat Telugu

సాయి ధ‌రమ్ తేజ్ హీరోగా నేను శైల‌జ ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేక‌ర్స్ నిర్మించిన చిత్రం 'చిత్ర‌ల‌హ‌రి'. సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, నివేథా పేతురాజ్ హీరోయిన్స్‌గా న‌టించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. మంచి హైప్ రావడంతో అందుకు తగిన విధంగానే భారీగా రిలీజ్ చేశారు. ఇప్పటికే ఓవర్సీస్ లొకేషన్లతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల షోలు పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలు వెల్లడిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. వరుసగా అర డజను ప్లాపులు తన ఖాతాలో వేసుకున్న సాయి తేజ్ ఈ సారి హిట్టుకొట్టాడా? ఆడియన్స్ టాక్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.

వన్ టైమ్ వాచ్

వన్ టైమ్ వాచ్

‘చిత్రలహరి' మూవీలో మెయిన్ యాక్టర్స్ గుడ్ పెర్ఫార్మెన్స్, కామెడీ వర్కౌట్ అయింది. క్లైమాక్స్‌లో ఈ సినిమా ద్వారా చెప్పాలనుకున్న పాయింట్ సరిగా చెప్పలేక పోయారు. ఇది ఒక్కసారి చూడదగ్గ చిత్రం అంటూ పలువురు ట్వీట్స్ చేశారు.

జస్ట్ ఓకే మూవీ

జస్ట్ ఓకే మూవీ

‘చిత్రలహరి' మూవీ జస్ట్ ఓకే అనే విధంగా ఉంది. కొన్ని చోట్ల బోరింగ్ అనిపిస్తుంది. కామెడీ సరిగా వర్కౌట్ కాలేదు. లవ్ ట్రాక్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదంటూ మరికొందరు అంటున్నారు.

ఫస్టాఫ్ బావుంది

ఫస్టాఫ్ బావుంది

‘చిత్రలహరి' మొదటి భాగం బావుంది. సునీల్‌ ఈ సినిమాలో మంచి పాత్రలో కనిపించారు.సెకండా జస్ట్ యావరేజ్ అనే విధంగా ఉందనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.

సాయి ధరమ్ తేజ్ బాగా చేశాడు

సాయి ధరమ్ తేజ్ బాగా చేశాడు

ఫస్టాఫ్ సినిమా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బావుంది. సాయి ధరమ్ తేజ్, సునీల్ బాగా చేశారు. సెకండాఫ్‌లో సాయి తేజ్ యాక్షన్ సీన్స్ అదరగొట్టాడు. డీఎస్పీ బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. సినిమా చూడొచ్చు అనే విధంగా ఉంది.

డీసెంట్ మూవీ

డీసెంట్ మూవీ

‘చిత్ర లహరి' డీసెంట్ మూవీ. తొలి భాగం కాస్త నెమ్మదిగా ఉంది, కానీ సెకండాఫ్ చాలా బావుంది. సాయి ధరమ్ తేజ్‌కు కంగ్రాట్స్ అంటూ మరికొందరు ట్వీట్ చేస్తున్నారు. మొత్తానికి ‘చిత్రలహరి' సినిమాపై యావరేజ్ నుంచి ఎబోయావరేజ్ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఓవరాల్‌గా యావరేజ్

ఓవరాల్‌గా యావరేజ్

చిత్రలహరి మూవీ ఫస్టాఫ్ డీసెంటుగా ఉండి ఫర్వాలేదు అనే ఫీలింగ్ కలిగించింది. కానీ సెకండాఫ్ చాలా సాగదీశాడు. ఓవరాల్‌గా యావరేజ్ మూవీ.

అందరికీ నచ్చక పోవచ్చు

అందరికీ నచ్చక పోవచ్చు

‘చిత్రలహరి' ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉంది. సెకండాఫ్ బావుంది. అయితే ఈ చిత్రం అందరికీ నచ్చకపోవచ్చ... అంటూ కొందరు ఈ సినిమాపై తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు.

ఆశించిన స్థాయిలో లేదు

ఆశించిన స్థాయిలో లేదు

చిత్రలహరికి 2.25/5 కంటే ఎక్కువ రేటింగ్ ఇవ్వలేం. సినిమా ఆశించిన విధంగా లేదు. ఫస్టాఫ్ కొన్ని చోట్ల బావుంది. సెకండాఫ్ చాలా సాగదీయడంతో బోర్ కొడుతుంది. ఈ చిత్రం బిలోయావరేజ్. సాయి ధరమ్ తేజ్ విజయం అందుకోవడం కష్టమే అని మరికొందరు అంటున్నారు.

సినిమా చాలా బావుంది

సినిమా చాలా బావుంది

ఫస్ట్ హాఫ్ ఓకే. జస్ట్ టైమ్ పాస్... డైలాగులు బావున్నాయి. ‘పరుగు పరుగు', ‘ప్రేమ వెన్నెల' పాటలు చాలా నచ్చాయి. సెకండాఫ్‌ నడిపించిన తీరు కూడా సూపర్. విజయం గురించి చెప్పే ఒక స్పూర్తి దాయకమైన కథ. సాయి ధరమ్ తేజ్ చాలా బాగా చేశాడు.

హానెస్ట్ మూవీ

హానెస్ట్ మూవీ

‘చిత్రలహరి' హానెస్ట్ మూవీ. సినిమాకు డైలాగులు గుండెకాయలా నిలిచాయి. యూత్ సినిమాకు కనెక్ట్ అవుతారు. నాకు సెకండాఫ్ కంటే ఫస్టాఫ్ చాలా బాగా నచ్చింది. సాయి ధరమ్ తేజ్, కళ్యాణి ప్రియదర్శన్ చాలా బాగా చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X