సినీ వర్గాల చూపంతా ఆ ఇంటి పైనే.. ఇంతకీ ఆ ఇంట్లో ఏముంది? మెగా మేనల్లుడికి లింకేంటి?
ప్రస్తుతం సినీ వర్గాల్లో ఓ ఇల్లు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇంటికి మెగా మేనల్లుడికి లింక్ ఉండటంతో టాలీవుడ్ లోని ఎంతోమంది ఆ ఇంటిని చూడటానికి వెళ్తున్నారట. ఈ లిస్ట్‌లో దర్శకనిర్మాతలు, నటీనటులు చాలా మంది ఉన్నారని సమాచారం. ఇంతకీ ఆ ఇంటిలో ఏముంది? దాని ప్రత్యేకత ఏంటి? మెగా మేనల్లుడి లింకేంటి? వివరాల్లోకి పోతే..

వార్తల్లో నిలిచిన ఇల్లు
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా 'ప్రతీ రోజు పండుగే'. మారుతి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిగో ఈ సినిమా విషయంలోనే ఆ ఇల్లు వార్తల్లో నిలిచింది. ఇది హైదరాబాద్ శివారు ప్రాంతమైన నానక్ రామ్ గూడలో ఉంది.

అసలు సంగతి ఇదీ.. అందుకే
అయినా ఇల్లు వార్తల్లో నిలవడమేంటి? అనుకుంటున్నారు కదూ! చూడండి మీకే తెలుస్తుంది. కొద్దిగైనా సిమెంట్ వాడకుండా కేవలం 17 రోజుల్లోనే 1.25 కోట్ల రూపాయల ఖర్చుతో ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ ఈ ఇంటిని నిర్మించాడట. పైగా అబ్బురపరిచే విధంగా. 'ప్రతీ రోజు పండుగే' సినిమాలోని ఎక్కువ సీన్స్ ఇక్కడే షూట్ చేయనున్నారు. అందుకే ఈ ఇంటిని చూసేందుకు సినీ పరిశ్రమకు చెందిన వారు చాలా మంది వెళ్తున్నారు.

సాయిధరమ్ తాత
'ప్రతీ రోజు పండుగే' సినిమాలో హీరో సాయిధరమ్‌కు తాతగా నటిస్తున్న సత్యరాజ్‌ది గోదావరి ప్రాంతం. ఆయన నివసించే ఇల్లు కథకు తగినట్టు ఉండాలనే కోణంలో పాత, కొత్తల కలయికగా ఈ భారీ ఇంటి సెట్ వేశారట. మొదట ఇలాంటి ఇంటి కోసం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఫలితం లేకపోవడంతో హైదరాబాద్ శివార్లలోని ఒక ఎకరం ప్రాంతంలో ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ ఈ ఇంటి సెట్ వేశారు.

చిరంజీవి అంచనాలను రీచ్ అయ్యేలా 'ప్రతీ రోజు పండుగే'
అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్స్‌పై తెరకెక్కుతోంది 'ప్రతీ రోజు పండుగే' మూవీ. బన్నీవాస్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆసక్తికర కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ బాణీలు కడుతున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ దశలో ఉండగానే సాయి ధరమ్ తేజ్ మామ మెగాస్టార్ చిరంజీవి కూడా పరిశీలించి ఓకే చేశారు. దీంతో చిత్రాన్ని అన్ని హంగులు జోడించి చిరంజీవి అంచనాలను రీచ్ అయ్యేలా నిర్మిస్తున్నారు డైరెక్టర్ మారుతి.


Click it and Unblock the Notifications











