హాట్ హాట్‌గా సాయిధరమ్ తేజ్ హీరోయిన్.. ఫోటోషూట్‌తో హల్‌చల్
లారిస్సా బొనెసి బ్రెజిల్ జాతీయురాలు. చైనా, అర్జెంటీనా, థాయ్‌లాండ్‌లో మోడలింగ్‌లో రాణించిన తర్వాత 2011 నుంచి భారత్‌లో మోడలింగ్, సినిమాల్లో కెరీర్‌ను కొనసాగిస్తున్నది.
Recommended Video

లారిస్సా బొనెసి బ్రెజిల్ జాతీయురాలు. చైనా, అర్జెంటీనా, థాయ్‌లాండ్‌లో మోడలింగ్‌లో రాణించిన తర్వాత 2011 నుంచి భారత్‌లో మోడలింగ్, సినిమాల్లో కెరీర్‌ను కొనసాగిస్తున్నది. ఎన్నో అంతర్జాతీయ ఉత్పత్తి కంపెనీలకు ఆమె మోడలింగ్ చేశారు. ప్రస్తుతం హిందీ, తెలుగు సినిమాల్లో నటించేందుకు ఉత్సాహం చూపుతున్నది. అంతేకాకుండా ఫిలిప్స్, వివెల్ సోప్, మహింద్రా లాంటి కంపెనీలకు మోడలింగ్ చేస్తున్నారు. అయితే తాజాగా లారిస్సా చేసిన ఫొటోషూట్ సోషల్ మీడియాలో హల్‌చల్ రేపుతున్నది.

బాలీవుడ్‌లో లారిస్సా హంగామా
అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం నటించిన దేశీ బాయ్ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించారు. ఆ తర్వాత సైఫ్ ఆలీ ఖాన్‌తో గో గోవా గాన్ అనే చిత్రంలో లారిస్సా నటించింది.
తిక్క చిత్రంలో సాయిధరమ్ తేజ్‌తో
2016లో మెగా హీరో సాయిధరమ్ తేజ్‌తో తిక్క చిత్రంలో నటించడం ద్వారా టాలీవుడ్‌కు లారిస్సా పరిచయమైంది. తిక్క చిత్రంలో లారిస్సా గ్లామర్‌గా కనిపించింది.

తిక్క షూట్‌లో క్లోజ్ ఫ్రెండ్‌షిప్
తిక్క చిత్రంలో సాయి ధరమ్ తేజ్‌తో కలిసి నటించినప్పుడు వారిద్దరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. ఈ మధ్య సాయిధరమ్ తేజ్‌తో కలిసి ఉన్న వీడియోను పోస్ట్ చేసింది. ప్రేమిస్తానని చెప్పు అని సాయిధరమ్ తేజ్‌ను అనడం ఆ వీడియోలో కనిపించింది.
హ్యాపీ బర్త్ డే లారిస్సా బొనేసి
ఈ వీడియో ఎప్పటికీ నా ఫేవరేట్ వీడియో. ఈ ప్రపంచంలోనో నీవు బెస్ట్. హ్యాపీ బర్త్ డే తేజూ.. లవ్ యూ పాగల్ అని లారిస్సా వీడియోతోపాటు ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది.
హాట్ హాట్‌గా లారిస్సా ఫొటోషూట్
తాజాగా లారిస్సా చేసిన ఫొటోషూట్‌కు బ్రహ్మండమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ ఫోటో షూట్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోను సాయిధరమ్ తేజ్ లైక్ చేయడం గమనార్హం.


Click it and Unblock the Notifications











