'పిల్లా నువ్వు లేని జీవితం' కాన్సెప్టు ఏంటి

By Srikanya

Sai Dharam Tej's Pilla Nuvvu Leni Jeevitham concept
హైదరాబాద్ : సాయి ధరమ్‌ తేజ్‌, రెజీనా జంటగా నటిస్తున్న చిత్రం 'పిల్లా నువ్వు లేని జీవితం'. జగపతిబాబు కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. బన్ని వాసు, హర్షిత్‌ నిర్మాతలు. అల్లు అరవింద్‌ సమర్పకులు. ప్రస్తుతం హైదరాబాద్‌లో క్లైమాక్స్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. మే రెండో వారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు నిర్మాతలు.

చిత్రం కాన్సెప్టు ఏమిటంటే...ప్రేమ కోసం పరితపించిన ఓ కుర్రాడి కథ ఇది. నా జీవితం నీ కోసమే అని ఓ అమ్మాయికి ఎలా చెప్పాడనే దిసగా కథ,కథనం నడుస్తుంది. కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉంటాయి. సాయిధరమ్‌ తేజ్‌ని ఓ హుషారైన పాత్రలో చూపిస్తున్నారు. జగపతిబాబు పాత్ర ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

చిత్ర దర్శకుడు రవికుమార్ చౌదరి మాట్లాడుతూ... ఈ సినిమాకోసం నాలుగైదు టైటిల్స్ అనుకున్నామని, అందులో బెస్ట్ చాయిస్‌గా ఎంపిక చేయమని, మాటీవీ ద్వారా ప్రేక్షకులను అడిగామనీ, దాదాపు అందరూ ఇదే పేరును ఎంపిక చేశారని, కథకు కూడా ఈ పేరే సరైనదని తెలిపారు. ఇందులో ప్రకాష్‌రాజ్, జగపతిబాబుల పాత్రలు హైలెట్‌గా ఉంటాయని తెలిపారు. పేరుగూర్చి తర్జనభర్జనలు పడుతుంటే నాలుగు పేర్లు అనుకుని, చివరికి ఈ పేరును ఖరారు చేశామని తెలిపారు.

హీరో సాయి ధరమ్ తేజ మాట్లాడుతూ... పెద్ద నిర్మాతలైన దిల్‌రాజు, అల్లుఅరవింద్‌ల నేతృత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో స్క్రీన్‌ప్లేలో సరికొత్త మ్యాజిక్ ఉంటుందని, అందరికీ నచ్చే చిత్రంగా రూపొందుతున్న ఇది తన రెండవ చిత్రంగా రూపొందడం ఆనందంగా వుందని తెలిపారు.

జగపతిబాబు మాట్లాడుతూ... శ్రీహరిగారంటే నాకు చాలా అభిమానం ఇష్టం. 'పిల్లానువ్వులేని జీవితం' సినిమాలో ఆయన స్థానాన్ని భర్తీ చేయాలి.. అని అడిగినప్పుడు ముందు 'వద్దు' అని చెప్పేశా. కానీ తప్పలేదు. కానీ.. షూటింగ్‌కి వెళ్లేముందు శ్రీహరి ఫొటోకి దండం పెట్టుకొని వెళ్లా అన్నారు.

చంద్రమోహన్, జయప్రకాష్‌రెడ్డి, దువ్వాసి మోహన్, ప్రభాస్ శ్రీను, సత్యవాణి, రఘుబాబు, రజిత, జోష్ రవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:అనూప్ రూబెన్స్, పాటలు:రామజోగయ్య శాస్ర్తీ, భాస్కరభట్ల, సుద్దాల అశోక్ తేజ, కెమెరా:దాశరధి శివేంద్ర, ఎడిటింగ్:గౌతమ్‌రాజు, మాటలు:డైమండ్ రత్నబాబు, వేమారెడ్డి, నిర్మాతలు:బన్ని వాసు, హర్షిత్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఎ.ఎస్.రవికుమార్ చౌదరి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X