Don't Miss!
- News
బండి సంజయ్ నియోజకవర్గం ఖరారు?
- Sports
IND vs NZ మూడో టీ20లో పృథ్వీ షాను ఖచ్చితంగా ఆడించాలి! ఎందుకంటే..?
- Finance
Adani Enterprises FPO: అనుకున్నది సాధించిన అదానీ.. మూడో రోజు మ్యాజిక్.. ఏమైందంటే..
- Lifestyle
Garuda Purana: ఈ పనులను తప్పనిసరిగా పూర్తి చేయాలి.. లేదంటే సమస్యలు తప్పవు
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Technology
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Republic ఓటీటీలో ఉద్యమంగా సాయిధరమ్ తేజ్ మూవీ.. 7 రోజుల్లో ఎన్ని కోట్ల వ్యూస్ సాధించిందంటే?
సుప్రీమ్ హీరో సాయి తేజ్, విలక్షణ దర్శకుడు దేవ్ కట్టా కలయికలో రూపొందిన సినిమా రిపబ్లిక్ చిత్రం థియేట్రికల్ రిలీజ్‌తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నది. అయితే సినిమా ప్రమోషన్ దశలో సాయి ధరమ్ తేజ్ యాక్సిండెంట్‌కు గురికావడం, ఆ తర్వాత కొద్దినెలలు అపోలో హాస్పిటల్‌లో ఉండటం కారణంగా ఈ సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉన్నారు. అయితే థియేటర్ రిలీజ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సినీ విమర్శకుల ప్రశంసలు అందుకొన్నది. ప్రస్తుతం రిపబ్లిక్ చిత్రం ఓటీటీలో రిలీజ్ ఘన విజయాన్ని అందుకోవడం విశేషంగా మారింది. ఈ వివరాల్లోకి వెళితే..

ఓటీటీలో ఎవరూ ఊహించనంతగా
రిపబ్లిక్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా, ఆశించినంతగా సంచలనాలను నమోదు చేయలేదు. అయితే సినిమా చూసిన ప్రతీ ఒక్కరు సామాజికంగా ఆలోచనల రేకెత్తించింది. ఇటీవల రిపబ్లిక్ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో రిలీజ్ అయింది. ఓటీటీలో ఈ చిత్రానికి ఎవరూ ఊహించనంతగా స్పందన లభించడంపై జీ5 యాజమాన్యం, నిర్వాహకులు ఆనందాన్ని మీడియాతో పంచుకొన్నారు.

వినోదం కంటే అంతకు మించి
ప్రేక్షకులకు కేవలం వినోదం అందించడం మాత్రమే తమ బాధ్యత అని జీ 5 సంస్థ అనుకోవడం లేదు. వినోదాత్మక సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్‌లతో ప్రజలను ఆకట్టుకుంటోంది. అదే సమయంలో ప్రజల్ని చైతన్యం చేసే సినిమాలనూ అందిస్తోంది. 'రిపబ్లిక్' వంటి సినిమాలకు అండగా ఉంటోంది. 'జీ 5' అంటే 'వినోదం మాత్రమే కాదు, అంతకు మించి' అనే పేరు తెచ్చుకుంటోంది.

రిపబ్లిక్ మూవీ కాదు.. మూవ్‌మెంట్
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ అధికారుల పాత్ర ఏమిటి? రాజకీయ నాయకులు ఎలా ఉండాలి? ప్రజలు ఏం చేయాలి? ఏం తెలుసుకోవాలి? వంటివి చెబుతూ... సామాజిక బాధ్యతతో రూపొందిన చిత్రమిది. దీనికి థియేటర్లలో మంచి స్పందన లభించింది. అప్పట్లో కరోనా భయాలతో వెళ్లని ప్రేక్షకులు, 'జీ 5' ఓటీటీ వేదికలో విడుదలైన తర్వాత సినిమాను ఓ ఉద్యమంలా చూశారు. 'రిపబ్లిక్' ఓ సినిమా కాదని, ఉద్యమం ('రిపబ్లిక్' మూవీ కాదు, మూవ్‌మెంట్) అని అంటున్నారు.

7 రోజుల్లో 12 కోట్ల వ్యూస్
నవంబర్ 26న 'జీ 5' ఓటీటీ వేదికలో 'రిపబ్లిక్' సినిమా విడుదలైంది. ఆ రోజు నుంచి సోషల్ మీడియాలో సినిమా ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా డైరెక్టర్ కామెంటరీతో సినిమాను విడుదల చేసిన 'జీ 5' బృందాన్ని అందరూ అభినందిస్తున్నారు. మన దేశంలో తొలిసారి డైరెక్టర్ కామెంటరీతో విడుదలైన సినిమా కూడా ఇదే. 'జీ 5'లో విడుదలైన ఏడు రోజుల్లో సినిమాను 12 కోట్ల నిమిషాల పాటు వీక్షకులు చూశారు. ఇదొక రికార్డు. సాయి తేజ్ కెరీర్‌లో ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అయ్యింది. సాయి తేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా కూడా 'జీ 5' ఓటీటీలో విడుదలైంది.
Recommended Video

ఫ్యామిలీతో కలిసి సాయిధరమ్ తేజ్
ఇదిలా ఉండగా, హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయిన సాయిధరమ్ తేజ కూడా ఇటీవల ఓటీటీలో ఈ సినిమాను వీక్షించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి చూస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సినిమా చూస్తూ తాను ఆరోగ్యంగా ఉన్నాననే విషయాన్ని తన అభిమానులకు, సినీ ప్రేక్షకుల అందించారు.