»   » రేయ్ : ప్రియురాలు అమ్మకానికి..? (ఫోటోలు)

రేయ్ : ప్రియురాలు అమ్మకానికి..? (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, సయామీ ఖేర్, శ్రద్ధాదాస్ హీరో హీరోయిన్లుగా బొమ్మరిల్లు వారి పతాకంపై వైవిఎస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'రేయ్'. హీరోయిన్ సయామీ ఖేర్ ప్రముఖ నటి షబానా అజ్మీ మేనకోడలు. ఈ చిత్రంలో సయామీ ఖేర్ సాయిధరమ్ తేజ్ ప్రియురాలిగా నటిస్తోంది.

తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అక్టోబర్ 11న ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే వరుస స్లాపు సినిమాలు నిర్మించి నష్టాలో ఉన్న వైవిఎస్ చౌదరి ఈ చిత్రంపై భారీ ఆశలే పెట్టుకున్నారు.

తాజాగా విడుదలైన ఈచిత్రం ఫోటోలు చర్చనీయాంశం అయ్యాయి. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ తన ప్రియురాలిని అమ్మకానికి పెట్టినట్లు ఫోటోల్లో కనిపిస్తోంది. మరి ఈ ఏ సందర్బానికి సంబంధించిందో సినిమా విడుదలైతే కానీ చెప్పలేం...

సాయి ధరమ్ తేజ్

సాయి ధరమ్ తేజ్

సినిమాను మాస్, క్లాస్ ఆడియన్స్, యూత్ మెచ్చే విధంగా పూర్తి కమర్షియల్‌గా రూపొందిస్తున్నాము అని చెబుతున్న వైవిఎస్ చౌదరి హీరో సాయి ధరమ్ తేజకు మెగా ట్యాగ్ ఉండటంతో భారీగానే ఖర్చు పెడుతున్నాడు. సినిమా బాక్సాఫీసు వద్ద రూ. 30 కోట్లు వసూలు చేస్తుందనే అంచనాతో ఖర్చుకు వెనకాడటం లేదు.

కోటిన్నరతో సాంగు

కోటిన్నరతో సాంగు

సినిమా క్లామాక్స్ సాంగుకు ఏకంగా కోటిన్నర ఖర్చు పెట్టారు. దీంతో పాటు సినిమా కథా పరంగా ఎక్కువ శాతం అమెరికా, ఇతర దేశాల్లోనే ఎక్కువగా చిత్రీకరణ జరిపారు. అయితే ట్రేడ్ వర్గాలు మాత్రం వైవిఎస్ అంచనాలు ఓవర్‌గా ఉన్నాయి అంటున్నారు.

సాయి ధరమ్ తేజ్

సాయి ధరమ్ తేజ్

మెగా హీరో అనే ట్యాగ్ ఉన్నప్పటికీ తొలి సినిమాకు రూ. 30 కోట్లు వస్తాయని ఆశించడం తప్పే అవుతుందని, ఆయన ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో భారీ‌గా ఖర్చు పెట్టి రిస్క్ చేసాడని అంటున్నారు. ఇప్పటి వరకు కొత్తగా ఎంటరైన హీరోకు ఆ రేంజిలో వసూళ్లు రాలేదు.

వైవిఎస్ చౌదరి

వైవిఎస్ చౌదరి

గతంలో మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ నటించిన తొలిసినిమా ‘చిరుత' బిజినెస్ రూ. 25 కోట్లు దాటలేదనే విషయాన్ని ట్రేడ్ నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఇటీవల అల్లు శిరీష్ ‘గౌరవం' పరిస్థితి ఏమైందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో వైవిఎస్ చౌదరి అంచనాలు ఏమేరకు రీచ్ అవుతాయో చూడాలి.

సయామీ ఖేర్

సయామీ ఖేర్

హీరోయిన్ సయామీ ఖేర్ ప్రముఖ నటి షబానా అజ్మీ మేనకోడలు. ఈ చిత్రంలో సయామీ ఖేర్ సాయిధరమ్ తేజ్ ప్రియురాలిగా నటిస్తోంది. అక్టోబర్ 11న ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

English summary
Megastar Chiranjeevi’s nephew Sai Dharam Tej will be seen as the lead actor in the film ‘Rey’. The movie has completed its shoot and it will release on October 11th. YVS Chowdhary is the director and producer of this movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu