Don't Miss!
- Finance స్విస్ పరిశోధనా సంస్థ పబ్లిక్ ఐ నెస్లే చిన్న పిల్లల ఆహారం సెరెలాక్ లో చక్కెరను కలుపుతున్నట్లు కనుగొంది
- Sports దూబెకు అన్యాయం..ఇది భారత్‌కే మంచిది కాదు- రోహిత్
- News మళ్లీ బయటపడ్డ ఈవీఎం మోసం ! ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు...?
- Automobiles రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- Technology Motorola నుంచి రెండు కొత్త ఇయర్ బడ్స్ లాంచ్! ధర, ఫీచర్లు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
వెస్టిండీస్ లో రిలీజ్ అవుతున్న మెగా హీరో చిత్రం
హైదరాబాద్ : చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌ని హీరోగా పరిచయం చేస్తూ బొమ్మరిల్లు వారి పతాకంపై వైవీఎస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'రేయ్' . షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రం మే 9 న విడుదల చేయాలని దర్శక,నిర్మాత వైవియస్ చౌదరి నిర్ణయించారు. ఈ చిత్రాన్ని వెస్టిండీస్ లో విడుదల చేస్తున్నారు. అక్కడ ఇంతకు ముందు ఏ తెలుగు సినిమా విడుదల కాలేదు. ఈ విషయాన్ని వైవియస్ చౌదరి మీడియాకు తెలియచేసారు.
వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ ''వెస్టిండీస్‌లో సెటిల్ అయిన ఓ కుటుంబానికి చెందిన యువకుడి కథ ఇది. అమెరికాలో జరిగే ఓ సంగీత పోటీ టైటిల్ పోరు నేపథ్యంలో చిత్రాన్ని తీర్చిదిద్దాం. ఎక్కువ భాగం వెస్టిండీస్, అమెరికాలోనే చిత్రీకరించాం. అందుకే ఆ ప్రాంతాల్లో సినిమా ప్రత్యేక షోలు ఏర్పాటు చేస్తున్నాం. వెస్టిండీస్‌లో విడుదల కాబోయే తొలి తెలుగు సినిమా ఇది. ఈ ప్రీమియర్ షోల్లో చిత్రబృందమంతా పాల్గొంటుంది'' అని తెలిపారు.
వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ 'ఇటీవలి కాలంలో యూత్‌ని టార్గెట్ చేస్తూ క్లాస్, ఫాస్ట్‌ఫుడ్ తరహా లవ్‌స్టోరీలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే 'దేవదాసు', 'దేశముదురు' తరహాలో భారీ స్థాయి మాస్, యూత్ లవ్‌స్టోరీలు రావడంలేదు. ఆ లోటుని తీర్చేవిధంగా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే రీతిలో 'రేయ్' తయారవుతోంది. కథానుగుణంగా ఈ చిత్రం ప్రథమార్థం వెస్టిండీస్ సంస్కృతి నేపథ్యంలో, ద్వితీయార్థం అమెరికా సంస్కృతి నేపథ్యంలో ఉంటుంది.
ఎఫ్.డి.సి. నిబంధనలకనుగుణంగా అమెరికా, వెస్టిండస్‌లో కొంత భాగం, హైదరాబాద్‌లో అత్యధిక భాగం షూటింగ్ చేశాం. భారీ నిర్మాణ విలువలు, ఆసక్తికరమైన కథాకథనాలతో పాటు అద్భుతమైన వినోదంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. తొలి సినిమాతోనే సాయిధరమ్ తేజ్ కచ్చితంగా స్టార్ హీరో అవుతాడనే నమ్మకం ఉంది. అలాగే సయ్యామి ఖేర్ తన అందంతో యూత్‌ని ఆకట్టుకుంటుంది. శ్రద్ధాదాస్ పాత్ర ఈ చిత్రానికి హైలైట్‌గా ఉంటుంది. ఇక పాటలన్నీ సందర్భోచితంగా, నాదైన గ్రాండియర్ స్టయిల్లో ఆకట్టుకుంటాయి' అని తెలిపారు.
చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్ కన్నా ఈ మేనల్లుడిలోనే చిరు పోలికలు బాగా ఉన్నాయి చిరంజీవి నట వారసత్వాన్ని పూర్తిస్థాయిలో అందిపుచ్చుకోగల సత్తా సాయి ధరమ్ తేజకే ఉన్నాయనిపిస్తోందన్న వాదనలను కూడా తీసుకవస్తున్నారు. ఏదైనా మేనమామ పోలికలు వస్తే అదష్టవంతులవుతారంటారు. మరి తన మేనమామలా సాయి ధరమ్ తేజ కూడా స్టార్ అవుతాడో లేదో వేచి చూడాల్సిందే...
ఎవరేమన్నా మెగాస్టార్ మాత్రం తమ కుటుంబం నుంచి వెండితెరకు పరిచయమవుతున్న తమ బిడ్డల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు శిరసు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నానంటున్నారు. దేవదాసుతో సంచలన విజయం నమోదు చేసిన వైవిఎస్ చౌదరి సాయిధరమ్ తేజతో ఎటువంటి హిట్ ఇస్తారో చూడాలి. చిత్రంలో అర్పిత్ రాంకా, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, అలీ, నరేష్, జె.పి తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి సంగీతం: చక్రి, కూర్పు: గౌతంరాజు, ఛాయాగ్రహణం: గుణశేఖరన్.