మెగా హీరో ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’(ఫస్ట్ లుక్)
హైదరాబాద్ : గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్, రెజీనా హీరో హీరోయిన్లుగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' అనే టైటిల్ ఖరారు చేసారు. వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్లో ఈచిత్రం తెరకెక్కబోతోంది. దిల్ రాజు నిర్మాతగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. ఈ నెల 27 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. మిక్కీ జే మేయర్ ఈచిత్రానికి సంగతం అందిస్తున్నారు. ఈ చిత్రం పోస్టర్ ఫస్ట్ లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు దిల్ రాజు తెలిపారు.

ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ నటించిన ‘పిల్లా నువ్వులేని జీవితం' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో రెజినా హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్ఠలు గీతా ఆర్ట్స్ మరియు శ్రీ వెంకటేశ్వర క్రియోషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బన్ని వాసు, శ్రీ హర్షిత్‌లు నిర్మాతలు, అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు. రవికుమార్ చౌదరి దర్శకుడు..ఈ ఆడియోని అక్టొబర్ 25న మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా మెగా అభిమానుల సమక్షంలొ విడుదల చేసారు.
జగపతి బాబు, ప్రకాష్ రాజ్, రఘు బాబు, దువ్వాసి మోహన్, రాజిత, సత్య కృష్ణ, సురేఖ వాణి తదితరులు నటిస్తున్న చిత్రానికి, మాటలు : డైమండ్ రత్నం , పాటలు : సిరివెన్నెల సీతారామశాస్త్రి , చంద్రబోస్, అశోక్ తేజ్, శ్రీమణి, సంగీతం : అనూప్ రూబెన్స్, కెమెరా : దాశరధి శివేంద్ర , ఆర్ట్ : రమణ వంక, ఎడిటింగ్ : గౌతంరాజు, ex- ప్రొడ్యూసర్ : సత్య, నిర్మాతలు : బన్నీ వాసు, శ్రీ హర్షిత్, కథ-స్క్రీన్ప్లే -మాటలు-దర్శకత్వం : ఏ.ఎస్ .రవి కుమార్ చౌదరి.


Click it and Unblock the Notifications











