తేజ్ ఆటపాటలో.. క్రికెట్ ఆడిన సాయిధరమ్.. 29న ‘ఐ లవ్ యు’ చెప్పేందుకు..

By Rajababu

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'తేజ్‌'. ఐ లవ్‌ యు అనేది ఉపశీర్షిక. ఈ చిత్రాన్ని క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు, వల్లభ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. అన్ని కారక్రమాలు పూర్తి చేసి జూన్‌ 29న ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Sai Dharam Tejs Tej I Love U set to release on 29th

కాగా, ఈ చిత్రంలోని మొదటి పాట శనివారం సాయంత్రం విడుదలైంది. అయితే రొటీన్‌కి భిన్నంగా ఈ పాటను విడుదల చేశారు. 'తేజ్‌ క్రికెట్‌ ప్రీమియర్‌ లీగ్‌' పేరుతో 'తేజ్‌ ఐ లవ్‌ యు' యూనిట్‌ సభ్యులు, రేడియో జాకీల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ జరిగింది. ఎంతో ఉత్సాహంగా, మరెంతో సరదాగా సాగిన ఈ మ్యాచ్‌లో 'అందమైన చందమామ నీవేనా.. నిన్ను నేను అందుకుంది నిజమేనా..' అంటూ సాగే ఫస్ట్‌ సాంగ్‌ను లాంచ్‌ చేశారు. సాహితి రచించిన ఈ పాటను హరిచరణ్‌, చిన్మయి గానం చేయగా గోపీసుందర్‌ సంగీతాన్ని సమకూర్చారు. ఈ పాటను ప్యారిస్‌లో శేఖర్‌ మాస్టర్‌ నృత్య దర్శకత్వంలో చిత్రీకరించారు.

సాయిధరమ్‌ తేజ్‌, అనుపమ పరమేశ్వరన్‌, జయప్రకాశ్‌, పవిత్రా లోకేశ్‌, పృథ్వీ, సురేఖా వాణి, వైవా హర్ష, జోష్‌ రవి, అరుణ్‌ కుమార్‌ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి లిరిక్స్‌: చంద్రబోస్‌, రామజోగయ్యశాస్త్రి, సాహితి, పోతుల రవికిరణ్‌, గోశాల రాంబాబు, స్టంట్స్‌: వెంకట్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: సతీశ్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: మోహన్‌, చీఫ్‌ కో డైరెక్టర్‌: చలసాని రామారావు, ఎడిటర్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఆర్ట్‌: సాహి సురేశ్‌, సంగీతం: గోపీ సుందర్‌, సినిమాటోగ్రఫీ: అండ్రూ.ఐ, మాటలు: డార్లింగ్‌ స్వామి, సహ నిర్మాత: వల్లభ, నిర్మాత: కె.ఎస్‌.రామారావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.కరుణాకరన్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X