»   » సాయి ధరమ్ తేజ్ ‘తిక్క’ మొదలైంది (ఫోటోస్)

సాయి ధరమ్ తేజ్ ‘తిక్క’ మొదలైంది (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సాయి ధరమ్ తేజ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్ బేనర్లో జులై 31న ఉదయం అన్నపూర్ణ స్టూడియోస్ లో సినిమా ప్రారంభమైంది. సునీల్ రెడ్డి దర్శకత్వంలో సి.రోహిణ్ కుమార్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘తిక్క' అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన లారిస్సా బోనేసి హీరోయిన్ గా నటిస్తోంది.

సాయి ధరమ్ తేజ్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. తెలంగాణ మినిస్టర్ మహేందర్ రెడ్డి కెమెరా స్విచాన్ చేసారు. పూజా కార్యక్రమాల అనంతరం సినిమా స్క్రిప్టును డైరెక్టర్ సునీల్ రెడ్డికి నాగబాబు అందించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హీరో సునీల్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్ రమణ, అలీ, నవీన్ విజయ్ కృష్ణ తదితరులు హాజరయ్యారు.

సినిమాకు సంబంధించిన వివరాలు, ఫోటోలు స్లైడ్ షోలో...

దర్శకుడు మాట్లాడుతూ..

దర్శకుడు మాట్లాడుతూ..

ఎవరి లైఫ్ కి వారే హీరో, కానీ ఈ సినిమాలో హీరో లైఫ్ కి హీరోనే విలన్. కామెడీతో సాగే ఫన్ మూవీ. హీరో తండ్రిగా రాజేంద్రప్రసాద్ నటిస్తున్నారు. ఆగస్టు 10 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి 2016 ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు.

సాయి ధరమ్ తేజ్

సాయి ధరమ్ తేజ్

సినిమాలో తన పాత్ర గురించి సాయి ధరమ్ మాట్లాడుతూ..నా పాత్ర పేరు ఆదిత్య. ఒక కన్ స్ట్రక్షన్ కంపెనీలో పని చేసే హీరో, హీరోయిన్ తో ప్రేమలో పడ్డ తర్వాత కొన్ని కారణాలతో గొడవ పడతారు. దీంతో హీరోకి తిక్క రేగుతుంది. వారి ప్రేమ ఎలా సఫలమైంది అనేది మిగతా స్టోరీ. హీరో క్యారెక్టర్ కి తగిన విధంగా ‘తిక్క' అనే టైటిల్ పెట్టామన్నారు.

నిర్మాత

నిర్మాత

సినిమా స్టోరీ నాకు చాలా బాగా నచ్చింది. మంచి ఎంటర్టెనింగ్ సబ్జెక్ట్. నిర్మాతగా ఇదే నా తొలి సినిమా. ప్రేక్షకులు నన్ను ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.

నటీనటులు

నటీనటులు

ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, అలీ, రావు రమేష్, పోసాని, తాగుబోతు రమేష్, అజయ్, వెన్నెల కిషోర్, సత్య తదితరులు నటిస్తున్నారు.

తెర వెనక

తెర వెనక

ఫైట్స్: విలియన్ ఓంగ్, డైలాగ్స్: భూపాల్, కథ: షేక్ దావూద్, ఆర్ట్: కిరణ్ కుమార్, ఎడిటర్: కార్తీక శ్రీనివాస, సినిమాటోగ్రఫీ: వి.ఎస్.జ్ఞానశేఖర్, మ్యూజిక్: థమన్, కో ప్రొడ్యూసర్: కిరణ్ రాగినేని, నిర్మాత: సి.రోహిణ్ కుమార్ రెడ్డి, దర్శకత్వం: సునీల్ రెడ్డి.

English summary
Sai Dharam Tej's Thikka movie launch event held at Annapurna Studios.
Please Wait while comments are loading...