Don't Miss!
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- News పోటీ నుంచి తప్పుకున్న శ్రీరాములు భార్య, రంగంలోకి గాలి జనార్దన్ రెడ్డి, వార్ వన్ సైడ్ కాదు, పోటీ !
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
- Sports ప్రశాంతంగా ఉన్నా.. ఇక చాలు- నరైన్ షాకింగ్ కామెంట్స్
- Automobiles ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
- Technology Android 15 Features ఆండ్రాయిడ్ 15 లో క్వారంటైన్ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..??
ఏంటి బావా నీకు పెళ్లంటా?.. ఆశ్చర్యంలో సుప్రీమ్ హీరో.. ఫేక్ న్యూస్‌పై సెటైర్స్
ఫేక్ న్యూస్ గోల తప్పేది కాదు.. అది పూర్తిగా అంతమయ్యేదీ కాదు. తప్పదు వాటిని భరించాల్సిందే. కొన్ని ఫేక్ న్యూస్‌ను చూసి నవ్వుకోవాల్సిందే.. కొన్నింటిని చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఇక కొన్ని వార్తలు ఉంటాయ్.. వ్యక్తుల ప్రతిష్టలను దిగజార్చేవి. వాటిని మాత్రం ఖండించాల్సిందే. అసలే ఫేక్ న్యూస్‌పై చిత్రసీమ గరంగరం ఉంది. విజయ్ దేవరకొండ ఉదంతం తరువాత ఫేక్ న్యూస్‌పై హీరోలు, దర్శకులు సెటైర్స్ వేస్తూనే ఉన్నారు.
హరీష్ శంకర్ సైతం..
ఫేక్ న్యూస్‌ను అరికట్టాలని హరీష్ శంకర్ సలహాలు ఇస్తున్నాడు. తన సినిమా గురించి ఓ ఊహాగానపు వార్త రాసినందుకు సదరు మీడియా సంస్థను వేలెత్తిచూపాడు. తమకు అందుబాటులో ఉంటున్నాను.. అలాంటప్పుడు తనను అడిగి కన్ఫమ్ చేసుకోవచ్చు కదా అని బహిరంగంగానే నిలదీశాడు.
పాటల రచయితపై రూమర్స్..
నిన్నటికి నిన్న పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ అనారోగ్యం పాలయ్యారని ఫేక్ న్యూస్ సృష్టించారు. పరిశ్రమకు చెందిన వారంతా వాటిని ఖండిస్తే గానీ ఆవార్తలు ఆగలేదు. ఇలా ఫేక్ న్యూస్ అనేది కనబడని వైరస్. ఎప్పుడు ఎలా ఎక్కడ పుడుతుందో ఎవ్వరూ చెప్పలేరు.
నిహారిక, వరుణ్ తేజ్‌ల పెళ్లిళ్లు..
నిహారిక, వరుణ్ తేజ్‌ల పెళ్లి విషయమై నాగబాబు ఏదో ఓ సందర్భంలో ఓ మాట అని ఉంటాడు. ఇక త్వరలోనే పెళ్లిళ్లు చేసే ఆలోచన ఉందని చెప్పుకొచ్చాడు. ఇక అంతే అప్పటి నుంచి వరుణ్ తేజ్ పెళ్లిపై పుంఖానుపుంఖాలుగా వార్తలు వచ్చాయి. వరుణ్ తేజ్ చేసుకునేది ఆ అమ్మాయేనంటా అని కొందరు ఫిక్స్ కూడా చేసేశారు.
ఏంటి బావా నీకు పెళ్లంటా?
ఇదిగో తోక అంటే అదిగో పులి అనే వెబ్‌సైట్స్, యూట్యూబ్ చానెల్లు లెక్కలేనన్ని ఉన్నాయి. అందులో ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రసారం చేసిన వార్తను సాయి ధరమ్ పోస్ట్ చేస్తూ.. ఏంటి బావా నీకు పెళ్లంటా? అని ఆశ్చర్యంలో మునిగిపోయిన ఎమోజీలను పెట్టి సెటైర్స్ వేశాడు.