నాకు పెళ్లైంది, ఇద్దరు పిల్లలున్నారు: సాయి ధరమ్ తేజ్ నోట ఊహించని మాట!

By Bojja Kumar

మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన 'జ‌వాన్' సినిమా డిసెంబర్ 1న విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో బిజీ అయ్యాడు సుప్రీమ్ స్టార్. తాజాగా రేడియో సిటీ ఆఫీసుకు వచ్చిన సాయి ధరమ్ తేజ్ అక్కడ ఎదురైన ప్రశ్నలకు ఎవరూ ఊహించని సమాధానం ఇచ్చారు.

ఎన్నిసార్లు మీరు క్లారిఫికేషన్ ఇచ్చినా కొన్ని రూమర్స్ మిమ్మల్ని వదిలి వెల్లడం లేదు. దీనికి పుల్‌స్టాప్ పెట్టే ఆలోచన ఉందా? అని రేడియో జాకీ అడగ్గా.... సాయి ధరమ్ తేజ్ ఆసక్తికర సమాధానం చెప్పారు.

పెళ్లయింది, ఇద్దరు పిల్లలు ఉన్నారు

పెళ్లయింది, ఇద్దరు పిల్లలు ఉన్నారు

త‌న‌కి ఎప్పుడో పెళ్ల‌యిపోయింద‌ని, ఇద్దరు డాటర్స్ ఉన్నారని, ఒక పాప‌కి ఆరేళ్లు, ఒక పాప‌కి రెండేళ్లు.. యా... ఐయామ్ హ్యాపీలీ మ్యారీడ్, వెరీ పీస్ ఫుల్ లైఫ్ గడుపుతున్నాను... అంటూ సాయి ధరమ్ తేజ్ ఎవరూ ఊహించని సమాధానం ఇచ్చారు.

తప్పుడు రాతలు రాసే వారిపై సాయి ధరమ్ తేజ్ పంచ్

తప్పుడు రాతలు రాసే వారిపై సాయి ధరమ్ తేజ్ పంచ్

తనకు పెళ్లయింది, ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పడం ద్వారా.... తన గురించి తప్పుడు రాతలు రాసే వారికి ఎవరూ ఊహించని పంచ్ ఇచ్చారు ఈ మెగా హీరో.

రేడియో జాకీని ఆట పట్టించిన సాయి ధరమ్ తేజ్

రేడియో జాకీని ఆట పట్టించిన సాయి ధరమ్ తేజ్

రేడియో జాకీ ఏ విషయం అడిగినా.... త‌న‌కి ఎప్పుడో పెళ్ల‌యిపోయింద‌ని, ఇద్దరు డాటర్స్ ఉన్నారని, ఒక పాప‌కి ఆరేళ్లు, ఒక పాప‌కి రెండేళ్లు.. యా ఐయామ్ హ్యాపీలీ మ్యారీడ్, లైఫ్ ఈజ్ గోయింగ్ గుడ్ అంటూ చెప్పిన విషయాన్నే మళ్లీ మళ్లీ చెబుతూ రేడియో జాకీని ఆటపట్టించారు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే.... నా గురించి రూమర్లు మళ్లీ మళ్లీ రాస్తున్నారు కదా అందుకే ఇలా చెప్పిందే మళ్లీ మళ్లీ చెబుతున్నాను అని సాయి ధరమ్ తేజ్ ఫన్ క్రియేట్ చేశారు.

రొమాన్స్ యుద్దంలా చేయొద్దన్నారు

రొమాన్స్ యుద్దంలా చేయొద్దన్నారు

వాట్సాప్‌లో ఒక మీమ్ చూసి నేను తెగ నవ్వాను. నాది, మెహరీన్ ఫోటో పెట్టి బాబూ సాయి ధరమ్ తేజ్.... రొమాన్స్ అంటే ముద్దుగా బొద్దుగా చేయాలి... అంతే కానీ యుద్ధంలా చేయకూడదు అని మీమ్ క్రియేట్ చేశారు. అది చూసి నేను చాలా నవ్వాను అని సాయి ధరమ్ తేజ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

రూమర్స్ లైట్

తన గురించి ఎవ‌రు ఎలా రాసుకున్నా తానేం అన‌బోన‌ని అన్నాడు. త‌న‌పై ఎన్నో రూమ‌ర్లు వ‌స్తున్నాయ‌ని, అవన్నీ లైట్ తీసుకుంటున్నానని సాయి ధరమ్ తేజ్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X