సాయి ధరమ్ తేజ్ సంచలన వ్యాఖ్యలు: మా ఫ్యామిలీనే వాళ్ల టార్గెట్.. అందరి ముందే అలా వార్నింగ్ ఇచ్చేశాడు

పేరుకు మెగా కాంపౌండ్‌కు చెందిన హీరోనే అయినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుని స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. మేనమామలు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరును నిలబెట్టేలా సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నాడు. ఇక, ఇటీవలి కాలంలో వరుస విజయాలను అందుకుని ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన రామ్ చరణ్ బర్త్‌డే సెలెబ్రేషన్స్ వేడుకలో సాయి ధరమ్ తేజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కొందరికి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చేశాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

 వరుస విజయాలతో సత్తా.. హ్యాట్రిక్ కొట్టాడు

వరుస విజయాలతో సత్తా.. హ్యాట్రిక్ కొట్టాడు

కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో సతమతం అవుతున్న తరుణంలో సాయి ధరమ్ తేజ్ 'చిత్రలహరి'తో హిట్ ట్రాక్ ఎక్కాడు. దీని తర్వాత మారుతి డైరెక్షన్‌లో వచ్చిన 'ప్రతిరోజూ పండగే'తో వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు, ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లు సాధించింది. ఇక, ఇటీవలే 'సోలో బ్రతుకే సో బెటర్'తో వరుసగా మూడో హిట్‌ను అందుకున్నాడు.

ప్రభుత్వాలను టార్గెట్ చేస్తున్న సాయి తేజ్

ప్రభుత్వాలను టార్గెట్ చేస్తున్న సాయి తేజ్

'సోలో బ్రతుకే' తర్వాత సాయి ధరమ్ తేజ్.. ప్రస్థానం ఫేం దేవకట్టా దర్శకత్వంలో 'రిపబ్లిక్' అనే సినిమా చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ఈ సినిమా ప్రారంభం అయింది. భగవాన్, పుల్లారావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ మూవీలో నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు.

సంబరంగా రామ్ చరణ్ బర్త్‌డే సెలెబ్రేషన్స్

సంబరంగా రామ్ చరణ్ బర్త్‌డే సెలెబ్రేషన్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు నేడు. దీనిని పురస్కరించుకుని ఒకరోజు ముందుగానే అంటే శుక్రవారం రాత్రే హైదరాబాద్ శిల్పకళావేదికలో మెగా సెలబ్రేషన్స్ నిర్వహించారు. దీనికి రెండు రాష్ట్రాల్లోని నలుమూలల నుంచి మెగా అభిమానులు హాజరయ్యారు. ఎంతో సందడిగా సాగిన ఈ వేడుకకు మెగా హీరోలు రామ్ చరణ్‌తో పాటు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ హాజరయ్యారు.

 స్పీచ్‌తో అదరగొట్టిన హీరో సాయి ధరమ్ తేజ్

స్పీచ్‌తో అదరగొట్టిన హీరో సాయి ధరమ్ తేజ్

అభిమానుల కోలాహళం నడుమ అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ స్పీచ్ అదరగొట్టేశాడు. తన మేనమామలు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి చెబుతూ ఫ్యాన్స్‌లో జోష్‌ను నింపాడు. ఇక, బర్త్‌డే బాయ్ రామ్ చరణ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. మొత్తానికి గతంలో చూడని విధంగా మాట్లాడి ఆశ్చర్య పరిచాడు.

 అప్పుడు మెగాస్టార్.. ఇప్పుడు రామ్ చరణ్

అప్పుడు మెగాస్టార్.. ఇప్పుడు రామ్ చరణ్

అంగరంగ వైభవంగా జరిగిన ఈ ఫంక్షన్‌లో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. 'అప్పట్లో మెగాస్టార్ బర్త్‌డే వేడుకలను చూసినప్పుడు ఈ రేంజ్‌లో మళ్లీ ఏ హీరోకైనా జరుగుతాయా? అనుకునేవాడిని. కానీ 2021లో మా బావ రామ్ చరణ్‌కు జరిగింది. ఇది ఫ్యాన్స్ వల్లే సాధ్యమైంది. మామయ్య తరువాత ఆ ప్లేస్‌లో అంత ప్రేమను మా చరణ్‌కి ఇస్తున్నారు. చాలా థాంక్స్' అంటూ చెప్పుకొచ్చాడు.

చెట్టు.. కాయలు.. అంటూ కొత్త కథ చెప్పాడు

చెట్టు.. కాయలు.. అంటూ కొత్త కథ చెప్పాడు

ఈ వేడుకలో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. 'ఒక మారుమూల గ్రామం.. దూరంలో ఒక చెట్టు ఉంది.. దానికి మామిడి కాయలు పండి ఉన్నాయి. ఒక స్కూల్ టీచర్.. ఎవరైతే ఆ చెట్టు దగ్గరకు వెళ్తారో ఆ చెట్టు కాయలు మీకే అని దశనిర్ధేశం చేస్తారు. కానీ ఆ పిల్లలు ఒకరి చేయి ఒకరు పట్టుకుని చెట్టు దగ్గరకు వెళ్లి కాయల్ని షేర్ చేసుకున్నారు. ఆ పిల్లలే మెగా హీరోలు' అని కథ చెప్పాడు.

సాయి ధరమ్ సంచలన వ్యాఖ్యలు.. వార్నింగ్

సాయి ధరమ్ సంచలన వ్యాఖ్యలు.. వార్నింగ్

ఇదే స్టేజ్ మీద నుంచి కొందరికి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్. 'చిరంజీవి గారు మహా వృక్షం. మాకు దారి చూపింది ఆయనే. మమ్మల్ని ఆపాలని చూస్తూ.. మా ఫ్యామిలీపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. వాళ్లు ఎవరో మీకు తెలుసు. మమ్మల్ని ఎంత తిట్టుకున్నా.. ద్వేషించినా అందరినీ ప్రేమిస్తూనే ఉంటాం. ఫ్యాన్స్‌కు దాసులుగా ఉంటాం' అంటూ ముగించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X