కనుసైగ శాసిస్తుంది.. చేతిలో చక్రం.. సిద్ధంగా సింహాసనం.. సంపూ సంచలన ట్వీట్

By Rajababu

Recommended Video

అజ్ఞాతవాసి పై తారల కామెంట్స్

పవన్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా అజ్ఞాతవాసి‌ చిత్ర ఫస్ట్‌లుక్‌కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తున్నది. ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలోని పవిత్ర గంగానదిలో సోమవారం ఉదయం అజ్ఞాతవాసి‌ టైటిల్‌ను పవన్, త్రివిక్రమ్, ఇతర యూనిట్ సభ్యులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అజ్ఞాతవాసి‌ వాసి ఫస్ట్‌లుక్ వైరల్‌గా మారిన నేపథ్యంలో బర్నింగ్ స్టార్ సంపూ, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, జవాన్ హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాదా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

సంపూర్ణేష్‌బాబు సెన్సేషనల్

సంపూర్ణేష్‌బాబు సెన్సేషనల్

పవన్ కల్యాణ్ కెరీర్‌లో 25వ చిత్రం అజ్ఞాతవాసిపై బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు సంచలన రీతిలో స్పందించారు. కనుసైగ శాసిస్తుంది....చూపుడు వేలు చక్రం తిప్పుతోంది...సింహాసనం సిద్ధంగా ఉంది అంటూ ట్వీట్ చేయడం సినీవర్గాల్లో చర్చానీయాంశమైంది.

ఫస్ట్‌లుక్ సింప్లీ బ్లాక్ బస్టర్

ఫస్ట్‌లుక్ సింప్లీ బ్లాక్ బస్టర్

అజ్ఞాతవాసి ఫస్టులుక్‌పై సినీ విమర్శకుడు ఉమెర్ సంధూ స్పందించారు. పవన్ కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్ర ఫస్ట్‌లుక్ బయటకు వచ్చింది. ఫస్ట్‌లుక్ సింప్లీ బ్లాక్ బస్టర్ అని ప్రముఖ సినీ విమర్శకుడు ఉమెర్ సంధూ ట్వీట్ చేశారు.

పవన్ లుక్‌కు అనూహ్య స్పందన

పవన్ లుక్‌కు అనూహ్య స్పందన

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ వారణాసిలో ఉన్నారు. అజ్ఞాతవాసి ఫస్ట్‌లుక్ లాంచ్ చేశారు. ఈ ఫస్ట్‌లుక్‌కు అనూహ్య స్పందన లభిస్తున్నది అని మరో ట్వీట్‌లో ఉమెర్ సంధూ పేర్కొన్నారు.

 భలే మాట చెప్పారు మాస్టారు..

భలే మాట చెప్పారు మాస్టారు..

తన ప్రాణం కంటే మిన్నగా అభిమానించే పవన్ కల్యాణ్ తాజా చిత్రం అజ్ఞాతవాసి ఫస్ట్‌లుక్‌పై సినీ నటుడు నితిన్ తనదైన శైలిలో స్పందించారు. భలే మాట చెప్పారు అంటూ పీకే క్రియేటివ్ వర్క్స్ చేసిన ట్వీట్‌పై వ్యాఖ్యలు చేశారు.

 సాయిధరమ్ తేజ్ కామెంట్స్

సాయిధరమ్ తేజ్ కామెంట్స్

అజ్ఞాతవాసి‌ టైటిల్, ఫస్ట్‌లుక్ ప్రకటించగానే సూపర్‌గా ఉంది అంటూ సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్‌ఫోన్ ఎన్నడూ ఉపయోగించవద్దు. అదీ పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఫస్ట్‌లుక్ వచ్చినప్పుడు అసలే సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేయవద్దు. మీరే చూడండి అజ్ఞాతవాసి‌ ఫస్ట్‌లుక్‌ను అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

 కొత్త అవతారంలో పవర్‌ఫుల్‌గా

కొత్త అవతారంలో పవర్‌ఫుల్‌గా

అజ్ఞాతవాసి‌ ఫస్ట్‌లుక్, టైటిల్‌పై టాలీవుడ్ గోల్డెన్ లెగ్ మెహ్రీన్ ఫిర్జాదా స్పందించారు. వావావావా...వ్. పవర్‌ఫుల్‌గా కొత్త అవతారంలో పవర్‌స్టార్ వచ్చేశాడు. ఇదిగో అజ్ఞాతవాసి‌, పీఎస్‌పీకే25 ఫస్ట్‌లుక్ అంటూ ఆమె ట్వీట్ చేశారు.

 పవన్ చూసి నేర్చుకోవాల్సిందే

పవన్ చూసి నేర్చుకోవాల్సిందే

ఫస్ట్‌లుక్ కంటే అజ్ఞాతవాసి టైటిల్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. టైటిల్ కంటే ఫొటోనే ఈ సినిమా ఏంటో అనే విషయాన్ని చెబుతున్నది. నమ్మకం, స్పష్టత అంటే అతడిని చూసి నేర్చుకోవాల్సిందే అని పీకే క్రియేటివ్ వర్క్స్ ట్వీట్ చేసింది.

 క్లాసీ అండ్ పవర్‌ఫుల్

క్లాసీ అండ్ పవర్‌ఫుల్

అజ్ఞాతవాసి ఫస్ట్‌లుక్‌పై దర్శకుడు మలినేని గోపిచంద్ రియాక్ట్ అయ్యారు. క్లాసీగా ఉంది. అంతేకాకుండా పవర్‌ఫుల్‌గా కూడా ఉంది అంటూ ట్వీట్ చేశారు.

 ఫస్ట్ లుక్ చాలా బాగుంది

ఫస్ట్ లుక్ చాలా బాగుంది

అజ్ఞాతవాసి ఫస్ట్‌లుక్‌‌పై అందాల నటి కాజల్ అగర్వాల్ కామెంట్ చేశారు. ఫస్ట్ లుక్ చాలా బాగుంది. నేను బాగా ఇష్టపడ్డాను. పవన్ కల్యాణ్ సార్‌కు గుడ్‌లక్ అంటూ కాజల్ ట్వీట్ చేశారు.

 పవన్ కల్యాణ్ సార్ కళ్లలో పవర్

పవన్ కల్యాణ్ సార్ కళ్లలో పవర్

అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండే కూడా ట్విట్టర్‌లో అజ్ఞాతవాసి ఫస్ట్‌లుక్‌‌పై సెన్సేషనల్ కామెంట్ చేశారు. పవన్ కల్యాణ్ సార్ కళ్లలో పవర్, ఇంటెన్సిటీ చూడండి అంటూ ఫొటోను పెట్టి షాలినీ ట్వీట్ చేశారు.

 అజ్ఞాతవాసి కోసం డబ్బింగ్

అజ్ఞాతవాసి కోసం డబ్బింగ్

అజ్ఞాతవాసి కోసం తెలుగులో తొలిసారి డబ్బింగ్ చెబుతున్నాను. సక్సెస్‌ఫుల్‌గా పూర్తయింది. నటిగా నేను పరిపూర్ణతను సాధించాను అని ఫీల్ అవుతున్నాను అని హీరోయిన్ కీర్తి సురేష్ ట్వీట్ చేశారు. అజ్ఞాతవాసిలో పవన్ సరసన కీర్తి సురేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

 అజ్ఞాతవాసి ఇండియా టాప్ ట్రెండింగ్

అజ్ఞాతవాసి ఇండియా టాప్ ట్రెండింగ్

అజ్ఞాతవాసి ఫస్ట్‌లుక్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నది. పవన్ కల్యాణ్ పోస్టర్ దేశవ్యాప్తంగా టాప్ ట్రెండింగ్‌లో ఉంది. సోమవారం ఉదయం (నవంబర్ 27న) రిలీజైన ఈ ఫస్ట్‌లుక్ టాప్ ట్రెండింగ్‌గా నిలువడం సెన్సేషనల్‌గా మారింది. అజ్ఞాతవాసి ఫస్ట్‌లుక్‌ను అభిమానులు ట్వీట్, షేర్ చేసుకొంటూ పండుగ చేసుకొంటారు.

అజ్ఞాతవాసి ఫస్ట్‌లుక్ వెరీ నైస్

అజ్ఞాతవాసి ఫస్ట్‌లుక్ వెరీ నైస్

అజ్ఞాతవాసి టైటిల్ బాగున్నది. పీఎస్‌పీకే ఫస్ట్‌లుక్ వెరీ నైస్. ఫస్ట్‌లుక్‌లో పవన్ కల్యాణ్ ఆటిట్యూడ్ అద్భుతంగా ఉంది. సంక్రాంతి రేసులో భాగంగా పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చే సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. అనిరుధ్ నుంచి వచ్చే ఆల్బమ్ బ్లాక్ బస్టర్ అవుతుంది అని ఆశిస్తున్నాను అని సినీ రచయిత గోపిమోహన్ ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X