టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్ చేసిన సాయిధరమ్ తేజ్.. విరూపాక్ష‌ సక్సెస్‌తో మంగళవారం మూవీకి జోష్

సినిమా రంగంలో డిఫరెంట్ కంటెంట్‌తో వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధిస్తే.. అలాంటి కథలు, జోనర్‌తో సినిమాలు రావడానికి ట్రెండ్ సెట్ చేస్తాయి. ఇటీవల కాలంలో గ్రామీణ నేపథ్యం, భావోద్వేగమైన పాయింట్‌తో రూపొందుతున్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ లభిస్తున్నది. RX 100, కాంతారా సినిమాలు ఓ ట్రెండ్ సెట్ చేస్తే.. థ్రిల్లర్ జోనర్‌తో వచ్చిన విరూపాక్ష మూవీ తెలుగు సినిమాలకు మార్గదర్శిగా నిలిచింది. ఈ సినిమా తర్వాత క్రియేట్ చేస్తున్న కంటెంట్‌కు ఎలాంటి ఆదరణ దక్కుతుందనే వివరాల్లోకి వెళితే..

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష చిత్రం క్షుద్రశక్తులు, మంత్రాలు, పూజలు నేపథ్యంగా పక్కా గ్రామీణ చిత్రంగా రూపొందింది. ఈ సినిమాకు ప్రేక్షకులు విశేషమైన ఆదరణ లభించడంతో ఘనం విజయం సాధించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. సాయిధరమ్ తేజ్ విభిన్నమైన ఫెర్ఫార్మెన్స్ ప్రేక్షకుల హృదయాలను దోచుకొన్నది.

 Sai Dharam Tej sets Thrillers trend with Virupaksha in Telugu film Industry

విరూపాక్ష చిత్రం ఊహించని విజయం సాధించడంతో ఆ తరహా చిత్రాలపై దృష్టిపెట్టారు. విరూపాక్ష సినిమాకు ముందే ప్రారంభమైనప్పటికీ.. మా ఊరి పొలిమేర 2, త్వరలో విడుదల కానున్న మంగళవారం మూవీ యూనిట్‌కు పెద్ద ఎత్తున కాన్ఫిడెన్స్‌ను బూస్ట్ చేసింది. విరూపాక్ష తరహా చిత్రంగా రూపొందిన పొలిమేర 2 బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నది.

 Sai Dharam Tej sets Thrillers trend with Virupaksha in Telugu film Industry

రూరల్ నేటివిటీ చిత్రాలు వస్తున్న తీరుపై బేబీ డైరెక్టర్ సాయి రాజేశ్ స్పందిస్తూ.. విరూపాక్ష చిత్రం నిర్మాతలకు భారీ విశ్వాసాన్ని నింపింది. ఆ సినిమా విజయంతో ప్రేక్షకుల అభిరుచి ఏమిటో తెలిసింది. థ్రిల్లర్లకు ప్రేక్షకుల్లో ఆదరణ ఉందనే విషయం స్పష్టమైంది. విరూపాక్ష లాంటి థ్రిల్లర్ జోనర్ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలువడంతో పొలిమేర 2, మంగళవారం సినిమాలకు క్రేజ్ పెంచిందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

 Sai Dharam Tej sets Thrillers trend with Virupaksha in Telugu film Industry

పాయిల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన మంగళవారం సినిమా నవంబర్ 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాకు రిలీజ్‌కు ముందే భారీ హైప్, బజ్, క్రేజ్ క్రియేట్ అయింది. దీంతో మరోసారి తెలుగు డైరెక్టర్లకు మరోసారి ఆశాభావం పెరిగిందనే మాట ఇండస్ట్రీలో వినిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X