»   » మెగా హీరో..‘శతమానం భవతీ’

మెగా హీరో..‘శతమానం భవతీ’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ‘పటాస్' మూవీ మంచి విజయం సాధించింది. కళ్యాణ్ రామ్ కెరీర్లో ది బెస్ట్ సినిమాగా నిలవడంతో పాటు వసూళ్ల పరంగా కూడా ఈ చిత్రం మంచి లాభాలు తెచ్చి పెట్టింది. ఇక రచయిత నుండి దర్శకుడిగా మారిన అనిల్ రావిపూడికి ఈ చిత్రం మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది.

‘పటాస్' తర్వాత అనిల్ రావిపూడి ఇంకా ఏ సినిమా మొదలు పెట్టలేదు. తన వద్ద ఉన్న స్టోరీలను పలువురు హీరోలకు చెబుతూ ఇన్నాళ్లు బిజీగా గడిపారు. ఎట్టకేలకు ఆయనకు ఓ హీరో నుండి గ్రీన్ సిగ్నల్ లభించింది. అతనెవరో కాదు మెగా ఫ్యామిలీకి చెందిన యువ హీరో సాయి ధరమ్ తేజ్‌. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈచిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ చిత్రానికి ‘శతమానం భవతీ' అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం.

Sai Dharam Tej 'Shathamanam Bhavathi'

ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' చిత్రాన్ని చేస్తున్నారు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే అనిల్ రావిపూడితో సినిమా మొదలు పెట్టనున్నారు. ఇంకా ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. త్వరలో అఫీషియల్ ప్రకటన వెలువడనుంది.

దిల్ రాజు సినిమా అంటే కమర్షియల్ అంశాలతో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులు మెచ్చే అంశాలు ఉంటాయి. పూర్తి ఎంటర్టెనింగ్ సబ్జెక్టుతో సినిమా ఉంటుంది. తాజాగా అనిల్ రావిపూడి సినిమా కూడా అలానే ఉంటుందని అంటున్నారు. సాయి ధరమ్ తేజ్ ను ఈ సినిమాలో సరికొత్తగా చూపించబోతున్నాడట అనిల్ రావిపూడి.

English summary
Writer Anil Ravipudi has become an overnight star when Kalyan Ram’s “Pataas” has turned blockbuster at box office. After narrating his story to heroes in Mega camp, we hear that Sai Dharam Tej has signed Pataas director’s movie. Producer Dil Raju will be handling this project.
Please Wait while comments are loading...