»   » ఓ వైపు చైతూ-సమంత లవ్ ఎఫైర్: సాయి ధరమ్ తేజ్ షాకింగ్ కామెంట్స్!

ఓ వైపు చైతూ-సమంత లవ్ ఎఫైర్: సాయి ధరమ్ తేజ్ షాకింగ్ కామెంట్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంత ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. త్వరలో ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని వారు అఫీషియల్ గా ప్రకటించక పోయినా... మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై మౌనం వహించడం ద్వారా పరోక్షంగా తమ ఎఫైర్‌ను అంగీకరించారు. ఇద్దరూ కలిసి డేటింగ్ చేస్తుండటం, విదేశాల్లో ఎంజాయ్ చేయడానికి వెలుతుండటంతో ఈ విషయంలో అందరికీ ఓ క్లారిటీ వచ్చినట్లయింది.

నాగ చైతన్య, సమంత ప్రేమ వ్యవహారం గురించి ఇంత చర్చ జరుగుతుంటే..... సాయి ధరమ్ తేజ్ సమంతను ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. మరి సాయి ధరమ్ తేజ్ కావాలని ఈ కామెంట్స్ చేసాడా? లేక అనుకోకుండా నోరు జారాడా అనేది చర్చనీయాంశం అయింది.

'ఏ మాయ చేశావే' సినిమా చూసినప్పటినుంచి సమంతపై పిచ్చి ప్రేమను పెంచుకున్నానని, ఆమెపై తనకు విపరీతమైన క్రష్ ఉందని సాయి ధరమ్ తేజ్ వెల్లడించాడు. ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి ధరమ్ ఈ షాకింగ్ కామెంట్లు చేశాడు.

మరి అంతటితో ఆగాడా? అంటే అదీ లేదు....ఇంకాస్త రెచ్చిపోయి తిక్క తిక్క కామెంట్స్ చేసాడు. అందుకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో..

మరీ ఇలానా?

మరీ ఇలానా?

సమంతపై ఎంత క్రష్(కోరిక) ఉంటే మాత్రం ఇలా.... అక్కినేని కోడలవ్వబోతోందని తెలిసీ మరీ ఇలా మాట్లాడటం బాగోలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

తహతహలాడాను

తహతహలాడాను

‘ఏ మాయ చేశావే' నాటి నుంచి ఈ అమ్మడుపై తనకు గాఢమైన ప్రేమ ఏర్పడిందని, తాను హీరో అయ్యాక ఎలాగైనా సమంతోతో చేయాలని తహతహలాడానని సాయి ధరమ్ తేజ్ కామెంట్స్ చేసాడు.

ఆలోచించకుండా ఓకే చెప్పేస్తా

ఆలోచించకుండా ఓకే చెప్పేస్తా

ఏ నిర్మాతైన సమంతను ఒప్పించి తన దగ్గరకు తీసుకొస్తే పాత్ర, పారితోషిం గురించి ఏ మాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేస్తానని ఓపెన్‌గా చేప్పేశాడు ఈ కుర్రాడు.

అంతా షాక్

అంతా షాక్

మెగా ఫ్యామిలీకి చెందిన స్టార్ అయి ఉండి.... సాయి ధరమ్ తేజ్ ఇలాంటి కామెంట్స్ చేయడం అందరినీ షాక్ కు గురి చేసింది.

నాగ చైతన్య ఏమనుకుంటాడో?

నాగ చైతన్య ఏమనుకుంటాడో?

తనకు కాబోయే భార్యపై సాయి ధరమ్ తేజ్ చేసిన కామెంట్స్ గురించి తెలిస్తే చైతూ ఎలా ఫీలవుతాడో ఏంటో?

సమంత

సమంత

నాగ చైతన్యతో పీకల్లోతు ప్రమలో ఉన్న సమంత... అతని కామెంట్స్ ను స్పోర్టివ్ గా తీసుకుంటుందా? ఘాటుగా జవాబిస్తుందా?

చైతూ-సమంత

చైతూ-సమంత

నాగ చైతన్య ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం.

నాగ నుండి గ్రీన్ సిగ్నల్

నాగ నుండి గ్రీన్ సిగ్నల్

చైతు, సమంత ప్రేమ పెళ్లికి నాగార్జున నుండి కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది.

English summary
Sai Dharam Tej shocking comments on Samantha. Samantha is my crush says Sai Dharam Tej in recent interview.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu