మామయ్య మొహం చూసిన తర్వాతే రోజు మొదలవుతుంది: సాయి ధరమ్ తేజ్

By Bojja Kumar

సాయిధరమ్‌ తేజ్‌, అనుపమ పరమేశ్వరణ్ హీరో హీరోయిన్లుగా కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'తేజ్.. ఐ లవ్ యు'. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్న ఈ మూవీకి గోపీ సుంద‌ర్ సంగీతం అందించారు. సినిమా ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ఆడియో వేడుక నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.... మా సినిమా ఆడియో వేడుకకు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన మావయ్యకు ముందుగా థాంక్స్. చాలా మందికి తెలియని విషయం... నేను ఉదయం లేవగానే ముందుగా చూసేది మా మామయ్య ఫోటో, ఆయనకు గుడ్ మార్నింగ్ చెప్పి నా రోజు మొదలు పెడతాను. ఆయన బ్లెస్సింగ్స్ లేకుండా ఏ రోజూ గడవదు. మాకు ఆయన ఇన్స్‌స్పిరేషన్. ప్రతి విషయంలో సపోర్టుగా ఉంటారు అన్నారు.

Sai Dharam Tej Speech at Tej I Love You Audio Launch

ఇంత మంచి సినిమా ఇచ్చిన నిర్మాత కె.ఎస్‌.రామారావుగారికి, మంచి రోల్ ఇచ్చిన క‌రుణాక‌ర‌ణ్ గారికి, అద్బుత‌మైన మ్యూజిక్ ఇచ్చిన గోపీసుంద‌ర్‌గారు స‌హ‌క‌రించిన అందరికీ థాంక్స్‌. ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను అని సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చారు.

దర్శకుడు క‌రుణాక‌ర‌ణ్ మాట్లాడుతూ నేను అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ఉన్న‌ప్పుడు రోజూ అన్న‌య్య ముఖం చూడ‌టానికి ఉదయం 7 గంటలకు కోడంబాకం బ్రిడ్జ్‌పై నిల‌బ‌డేవాడిని. ఆ దారిలో ఆయన కారులో వెళ్లేవారు. సినిమా క‌ల‌ను మొదట ఇచ్చింది పెద్దన్న‌య్య(చిరంజీవి)... తొలి సినిమా ఇచ్చింది చిన్న‌న్న‌య్య (ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌). ఇప్పుడు నా త‌మ్ముడితో సినిమా చేస్తున్నాను. అన్నయ్య చిరంజీవి ఆశీర్వాదం ఉంటే చాలు మరింత ఉత్సాహంతో ముందుకు వెళతాను అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X