Virupaksha Twitter Review: విరూపాక్షకు క్రేజీ టాక్.. ఆ సినిమాల తర్వాత ఇదే.. వాళ్లు ఈ మూవీ చూశారంటే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా తక్కువ సినిమాలకే మంచి గుర్తింపును సొంతం చేసుకుని.. ఫలితాలతో సంబంధం లేకుండా ప్రాజెక్టులను చేసుకుంటూ వెళ్తోన్నాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. ఆ మధ్య వరుస హిట్లతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన అతడు.. 'రిపబ్లిక్'తో ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాడు. దీంతో ఈ సారి సరికొత్త ప్రయోగం చేశాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు 'విరూపాక్ష' అనే విలేజ్ హర్రర్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. మరి ఈ సినిమాకు ట్విట్టర్‌లో ఎలాంటి టాక్ వచ్చింది? దీనితో సాయి తేజ్ హిట్ కొట్టాడా? లేదా? అనేవి చూద్దాం పదండి!
విరూపాక్షగా వచ్చిన సాయి తేజ్:సాయి ధరమ్ తేజ్ హీరోగా.. కార్తీక్ దండు రూపొందించిన మూవీనే 'విరూపాక్ష'. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై దీన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి అంజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని అందించారు. ఇందులో సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్ తదితరులు కీలక పాత్రలను చేశారు.

అలాంటి స్టోరీ... ట్విస్టులతోనే:ఓ గ్రామంలో అంతు చిక్కని కథ వల్ల అందరూ భయపడుతూ ఉంటారు. అక్కడకు వెళ్లిన హీరో ఆ సమస్యను ఎలా పరిష్కరించాడు? అందుకు అతడే ఎందుకు ముందుకు వెళ్లాడు? ఇంతకీ ఆ గ్రామంలో మిస్టరీ ఏంటి? అనే అంశాలతో 'విరూపాక్ష' మూవీ తెరకెక్కింది. ఇందులో ఎన్నో ట్విస్టులు, హర్రర్ ఎలిమెంట్స్ జోడించారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.
అక్కడ మొదలు.. రెస్పాన్స్‌తో:హర్రర్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన 'విరూపాక్ష' మూవీ ఎంతో గ్రాండ్‌గా విడుదల అయింది. ఇప్పటికే యూఎస్ సహా చాలా ప్రాంతాల్లో షోలు కూడా ప్రదర్శితం అయ్యాయి. అన్ని చోట్లా దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక, ఈ సినిమాకు అన్ని ఏరియాల నుంచి మంచి టాక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాయి ధరమ్ తేజ్ మంచి కమ్‌బ్యాక్ ఇచ్చాడని చెబుతున్నారు.
ఫస్టాఫ్ డీసెంట్‌గా ఉందంటూ:సాయి ధరమ్ తేజ్ నటించిన 'విరూపాక్ష'ను చూసిన ఓ నెటిజన్ ట్విట్టర్‌లో తన అభిప్రాయం చెప్పాడు. అందులో అతడు 'బోరింగ్ లవ్ ట్రాక్ ఉన్నప్పటికీ.. కథాంశం అంతా ఆసక్తికరంగా సాగుతుంది. కొన్ని చిల్లింగ్ మూమెంట్లతో ఇంటర్వెల్ ముందు నుంచి సినిమా బాగా పుంజుకుంది. దీనికి సౌండ్ మిక్సింగ్ బాగా సెట్ అయింది. సెకెండాఫ్‌పై ఆసక్తిని పెంచింది' అని రాశాడు.
ఆ మూవీల తర్వాత ఇదే అని:హర్రర్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన 'విరూపాక్ష' మూవీని చూసిన మరో నెటిజన్ 'ఒక చంద్రముఖి.. ఒక అరుంధతి.. ఒక కాంచన.. ఒక విరూపాక్ష. వీక్ హార్ట్ పేషెంట్లు ఎవరైనా ఉంటే ఈ సినిమాకు వెళ్లకండి. మొదటి పది నిమిషాల లవ్ ట్రాక్ తప్ప మిగిలిదంతా హర్రర్‌గానే ఉంది. ఈ సినిమాను థియేటర్లలో మాత్రమే చూడండి' అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
సీటులో కూర్చోలేని విధంగా:'విరూపాక్ష' మూవీని చూసిన ఇంకో నెటిజన్ 'విరూపాక్ష ఫస్టాఫ్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. లవ్ ట్రాక్, లీడ్ యాక్టర్స్ మధ్య సీన్స్‌తో పాటు కొన్ని థ్రిల్ ఎలిమెంట్స్ బాగున్నాయి. సెకెండాఫ్‌లో హర్రర్ అండ్ స్టోరీ బాగుంది. సీటులో కూర్చోలేని క్లైమాక్స్‌తో పాటు హర్రర్ ఎలిమెంట్స్ బాగున్నాయి. ఓవరాల్‌గా సెకెండాఫ్ ఎక్స్‌లెంట్‌గా ఉంది. సినిమాకు నా రేటింగ్ 3/5' అని చెప్పాడు.
వాళ్లంతా బాగా చేశారంటూ:సాయి ధరమ్ తేజ్ - సంయుక్త జంటగా నటించిన 'విరూపాక్ష' మూవీని చూసిన ఇంకొక నెటిజన్ 'విరూపాక్ష మూవీని ఇప్పుడే చూశాను. ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా ఉంది. డైరెక్టర్ మంచి కథను తీసుకొచ్చాడు. సాయి ధరమ్ తేజ్ యాక్టింగ్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. సంయుక్త కూడా బాగా నటించింది. నవీన్ నూలి ఎడిటింగ్ బాగుంది' అంటూ వివరించాడు.
అది తప్ప అంతా బాగుంది:సుప్రీమ్ హీరో సాయి తేజ్ నటించిన 'విరూపాక్ష'ను చూసిన మరో నెటిజన్ 'కొన్ని ముఖ్యమైన క్షణాలు, చక్కని ట్విస్టులతో ఆసక్తికరమైన కథాంశం. ఫస్టాఫ్‌లో లవ్ ట్రాక్ బోరింగ్‌గా ఉంది. అలాగే, కొన్ని సన్నివేశాలు అసమానంగా ఉన్నాయి. అయినప్పటికీ స్క్రీన్‌ప్లే చాలా వరకూ ఎంగేజింగ్‌గా ఉండడంతో వర్కౌట్ అయింది. విరూపాక్షకు నా రేటింగ్ 3/5' అని చెప్పుకొచ్చాడు.

ఓవరాల్‌గా అలాంటి టాక్:సాయి ధరమ్ తేజ్ నటించిన 'విరూపాక్ష' మూవీకి సంబంధించి ఇప్పటి వరకూ చూసిన ట్వీట్లను బట్టి చూస్తే దీనికి మొత్తంగా మంచి టాకే వచ్చింది. చాలా మంది ఈ సినిమా బాగుందనే చెప్తున్నారు. అయితే, కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నా అవి అంతగా ప్రభావం చూపవని అంటున్నారు. మొత్తంగా ఈ సినిమా సాయి తేజ్‌కు మంచి కమ్‌బ్యాక్ అవుతుందని అర్థం అవుతోంది.


Click it and Unblock the Notifications











