»   » మొన్న రాంచరణ్, నేడు సాయిధరమ్ తేజ్.. డౌట్ ఎందుకు, ఏం చెప్పినా చేస్తా!

మొన్న రాంచరణ్, నేడు సాయిధరమ్ తేజ్.. డౌట్ ఎందుకు, ఏం చెప్పినా చేస్తా!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    Sai Dharam Tej Serious Comments On Pawan Kalyan

    పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి మెగా ఫ్యామిలీ నుంచి మద్దత్తు పెరుగుతోంది. ఇటీవల రాంచరణ్ మద్దత్తు ప్రకటించగా తాజగా సాయిధరమ్ తేజ్ కూడా అదే బాటలో నడిచాడట. పవన్ కళ్యాణ్ ఒక్కడే జనసేన పార్టీని వన్ మాన్ ఆర్మీగా నడిపిస్తున్నాడు. కుటుంబానికి తన మద్దత్తు ఎప్పుడూ ఉంటుందని, ఆ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని రాంచరణ్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తెలిపిన సంగతి తెలిసిందే. రాంచరణ్ వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ కూడా రిప్లై ఇచ్చారు. రాజమహేంద్రవరంలో ఓ మాల్ ఓపెనింగ్ కు వెళ్లిన సాయిధరమ్ తేజ్ జనసేన పార్టీకి మద్దత్తు ఉంటుందని తెలిపాడు.

     ఒక్కడిగానే ప్రారంభించి

    ఒక్కడిగానే ప్రారంభించి

    పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించే సమయంలో కుటుంబ మద్దత్తు లేదు. ఆ సమయంలో అనేక రాజకీయ సమీకరణాలు ఉన్నాయి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు పూర్తిగా దూరమైనట్లే కనిపిస్తున్నారు.

    బాబాయ్‌కి మద్దత్తుగా

    బాబాయ్‌కి మద్దత్తుగా

    హ్యాపీ మొబైల్స్ కు రాంచరణ్ ఎండార్స్ మెంట్ చేస్తున్నారు. ఆ ప్రకటన సమయంలో మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీకి ప్రచారం చేసే విషయంలో తనకు రెండో ఆలోచన లేదని తెలిపాడు. బాబాయ్ పిలిచిన వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెళతానని రాంచరణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

    అదే దారిలో తేజు

    అదే దారిలో తేజు

    మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా అదే విషయాన్ని ప్రస్తావించాడు. రాజమహేంద్రవరంలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వెళ్లిన తేజు మీడియాతో మాట్లాడాడు. జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తారా అని మీడియా ప్రశ్నించగా తేజు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.

    ఏం చెప్పినా చేస్తా

    ఏం చెప్పినా చేస్తా

    ఆ విషయంలో డౌట్ ఎందుకు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినా చేస్తా అంటూ సాయిధరమ్ తేజ్ సమాధానం ఇచ్చాడు. సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం తేజు ఐ లవ్ యూ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 29 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    English summary
    Sai Dharam Tej Supports pawan kalyan Political journey
    దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more