ఆడ వేషంలో సుప్రీమ్ హీరో.. మదర్‌కు స్పెషల్ విషెస్
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్.. మెగా ఫ్యామిలీ ట్యాగ్ లైన్‌తో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. అతి కొద్ది కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకున్నాడు. కేవలం సినిమాలు, నటన ద్వారాగానే కాకుండా.. నిజాయితీ, నిబద్దతతో ఎంతో మందిని సొంతం చేసుకున్నాడు. సినిమా జయాపజయాలతో నిమిత్తం లేకుండా సాయి ధరమ్ తేజ్ క్రేజ్ పెరగుతూ వచ్చింది. దానికి కారణం.. ఈ సుప్రీమ్ హీరో నిజాయితే. సినిమా ఆఢని ప్రతీసారి.. వాటిని ఒప్పుకోవడం, వాటికి ఎవ్వరినీ నిందించకుండా తప్పంతా తనమీదే వేసుకోవడం అభిమానులను మరింత దగ్గర చేసింది. అందుకే ఒక్క సక్సెస్ కోసం ఎన్నో యేళ్లు వేచిచూశాడు.
ఎన్ని డిజాస్టర్లు పలకరించినా.. పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నించాడు. చివరకు హిట్ ట్రాక్‌లో పడ్డాడు. చిత్రలహరి, ప్రతిరోజూ పండగే వంటి సూపర్ హిట్‌లతో దూసుకుపోతోన్నాడు. కాసేపు సినీ కెరీర్‌ను పక్కనబెడితే.. సాయి ధరమ్ తేజ్‌కు అతని అమ్మ (మెగా సోదరి విజయ దుర్గ) అంటే ఇష్టం. ఇప్పటికీ తల్లి చాటు బిడ్డలానే ఉంటాడు సాయి ధరమ్ తేజ్. నేటి మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని.. చిన్ననాటి ఆనంద క్షణాలను గుర్తు చేసుకున్నాడు.

కూతుళ్లు లేని తల్లికి అబ్బాయిలోనే ఆడబిడ్డను చూసుకుంటుంది. చిన్నప్పుడు ఆడపిల్లలా తయారు చేసి సంబర పడిపోతుంటారు. అది సర్వసాధారణమే. సాయి ధరమ్ తేజ్‌కు కూడా ఇలాంటి ఘటనే ఎదురైంది. తనకు చిన్నప్పుడు లేడీ గెటప్ వేయించిందని చెబుతూ నాటి ఫోటోను షేర్ చేశాడు. ఈ మేరకు పోస్ట్ చేస్తూ.. 'ఈ తల్లులందరూ తమ కొడుకులను చిన్నతనంలో అమ్మాయిలా ఎందుకు తయారు చేస్తారో అర్థమే కాదు.. వారిలా బతకడం, ఉండటం ఎంత కష్టమో తెలియజెప్పే క్రమంలో బహుశా ఇలా చేస్తారేమో.. లేదా.. వారి త్యాగాలను మనం గుర్తించాలని అలా చేస్తారేమో?.. మన మహిళలను మనం ప్రేమిద్దాం, రక్షిద్దాం, గౌరవిద్దాం. ప్రతీ అమ్మకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు' అని తెలిపాడు.


Click it and Unblock the Notifications











